POCSO | పోక్సో కేసు నుంచి ముస్లిం పర్సనల్ చట్టం రక్షణ కల్పించదు.. ఢిల్లీ హైకోర్టు స్పష్టం
POCSO : 18 ఏళ్ల లోపు యువతిని వివాహం చేసుకుని, లైంగిక చర్యకు పాల్పడిన వ్యక్తిపై పోక్సో చట్టం లేదా బీఎన్ఎస్ కింద చర్యలు తీసుకోకుండా ముస్లిం పర్సనల్ లా అడ్డుకోలేదని కోర్టు వివరించింది.
POCSO : పోక్సో కేసు నుంచి ఒక నిందితుడికి ముస్లిం పర్సనల్ లా వివాహం రక్షణ కల్పించలేదని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. 18 ఏళ్ల లోపు యువతిని వివాహం చేసుకుని, లైంగిక చర్యకు పాల్పడిన వ్యక్తిపై పోక్సో చట్టం లేదా బీఎన్ఎస్ కింద చర్యలు తీసుకోకుండా ముస్లిం పర్సనల్ లా అడ్డుకోలేదని కోర్టు వివరించింది. జస్టిస్ సంజీవ్ నారులా ఆధ్వర్యంలోని ఢిల్లీ హైకోర్టు బెంచ్ ఒక కేసు విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసింది.
ఒక వ్యక్తిపై బీఎన్ఎస్ సెక్షన్ 64(1), సెక్షన్ 6, పోక్సో యాక్ట్ కింద దాఖలైన కేసును కొట్టివేయాలంటూ క్వాష్ పిటిషన్ దాఖలు చేశాడు. వ్యక్తిగత, మత పరమైన చట్టాలను ఉపయోగించి ఒక వ్యక్తిపై దాఖలైఐన పోక్సో కేసును కొట్టివేయలేమని హైకోర్టు స్పష్టం చేసింది. నిందితుడి క్వాష్ పిటిషన్ను కొట్టివేసింది. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది. 18 ఏళ్ల లోపు వారిని వివాహం చేసుకునేందుకు ముస్లిం పర్సనల్ లా అనుమతించినంత మాత్రాన ఆ వివాహాన్ని గుర్తించలేమని, ఆ భార్యతో జరిపై లైంగిక చర్యను పోక్సో నుంచి రక్షణ కల్పించలేమని కోర్టు తెలిపింది.
భర్తకు 28.. భార్యకు 16
ఈ కేసుకు సంబంధించిన వివరాలివి. 16 ఏళ్ల 3 నెలల వయసున్న ఒక బాలికను 28 ఏళ్ల ఒక యువకుడు వివాహం చేసుకున్నాడు. వారి కలిసి ఉంటున్నారు. వారి కాపురం ఫలితంగా భార్య కొంతకాలానికి గర్భం దాల్చింది. దీంతో గర్భధారణ పరీక్షల కోసం ఆ బాలిక ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లింది. దీంతో ఆస్పత్రి వైద్యులు పోలీసులకు సమాచారం అందించారు. వైద్యులు వారికి ఉన్న నిబంధనల ప్రకారం ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లగా పోలీసులు బాలిక భర్తపై పోక్సో సహా వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
దీంతో బెయిల్ కోరుతూ ఆ భర్త కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. ఈ సందర్భంగా గర్భ దాల్చిన మైనర్ భార్య తన భర్తకు మద్దతుగా నిలిచింది. తన ఇష్టపూర్వకంగానే పెళ్లి చేసుకున్నానని, ఇష్టంతోనే గర్బం దాల్చానని చెప్పింది. ఈ విషయంలో ఎవరి బలవంతం లేదని కోర్టుకు తెలిపింది. తమ చట్టాల ప్రకారం ఇది చెల్లుబాటు అవుతుందని వాదించింది. దీంతో తన భర్తకు బెయిల్ ఇవ్వాలని కోర్టును కోరింది. అయితే, దీనికి కోర్టు నిరాకరిచింది. 1
8 ఏళ్ల లోపు యువతిని వివాహం చేసుకున్నా, ఆ తర్వాత లైంగిక చర్యకు పాల్పడి గర్భం దాల్చేందుకు కారణమైతే భర్త అయినా, ఎవరైనా సరే చట్ట ప్రకారం శిక్షార్హులే అని కోర్టు తెలిపింది. ఇతర చట్టాలు దీన్నుంచి రక్షణ కల్పించలేవని వ్యాఖ్యానించింది. నిందితుడి బెయిల్ పిటిషన్, క్వాష్ పిటిషన్ను కొట్టేసింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- BNS
- Delhi High Court
- muslim
- POCSO
RELATED ARTICLES
తాజా వార్తలు
Meerut | భర్తను చంపిన భార్య, ఆమె ప్రియుడికి మరణశిక్ష.. హత్య చేసి పాముకాటుగా నమ్మించిన భార్య
School Shooting: అమెరికా స్కూల్లో కాల్పుల ఘటన.. ముగ్గురు చిన్నారులు మృతి
Tragedy | సత్యసాయి జిల్లాలో విషాదం.. రిజర్వాయర్లో ప్రమాదవశాత్తు పడి ఐదుగురు బాలికలు మృతి
Bhuvneshwar Kumar: గాయపడ్డ అర్షదీప్.. భారత బృందంలోకి భువనేశ్వర్
Warangal | వరంగల్ డిఐజి ఆఫీస్లో ఇద్దరు ఉద్యోగుల సస్పెన్షన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

