Muthoot Fincorp : భారత క్రికెట్ జట్టు టైటిల్ స్పాన్సర్ల జాబితాలో ప్రముఖ ఫైనాన్స్ కంపెనీ ముత్తూట్ ఫిన్‌కార్ప్(Muthoot Fincorp) లిమిటెడ్ చేరింది. బంగారంపై రుణాలతో అందరికీ చేరువైన ఈ సంస్థను టీమిండియా టైటిల్ స్పాన్సర్‌గా భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ప్రకటించింది. శనివారం సందడిగా జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఈ విషయాన్ని బీసీసీఐ అధికారికంగా వెల్లడించింది. అనంతరం భారత క్రికెటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, కోచ్ గౌతం గంభీర్ తదితరులు ముత్తూట్ ఫిన్‌కార్ప్ అని రాసున్న పెద్ద బ్యాటుపై సంతకాలు చేశారు.
ప్రముఖ ఫైనాన్స్ కంపెనీ ముత్తూట్ ఫిన్‌కార్ప్ లిమిటెడ్ భారత జట్టు టైటిల్ స్పాన్సర్షిప్ హక్కులు దక్కించుకుంది. వచ్చే రెండేళ్ల పాటు టీమిండియా జెర్సీలపై ముత్తూట్ పేరు తళుక్కుమననుంది. బ్లూ ముత్తూట్ పేరుతో టైటిల్ స్పాన్సర్‌గా వ్యవహరించనుందీ కంపెనీ. ఈ విషయాన్ని బీసీసీఐ శనివారం అధికారికంగా వెల్లడించింది. ముత్తూట్, బీసీసీఐ ప్రత్యేకంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో క్రికెటర్లు కోహ్లీ, రోహిత్, కోచ్ గౌతం గంభీర్‌లు, టీమిండియా సభ్యులు పాల్గొన్నారు.
🚨 Announcement 🚨
BCCI announces Muthoot FinCorp Limited as the Title Sponsor for India Home Cricket, with the association running through March 2028.
More Details 🔽https://t.co/EQxPI8NR3P
— BCCI (@BCCI) September 26, 2026
ఆపై.. ముత్తూట్ ఫిన్‌కార్ప్ అని నీలం రంగులో రాసున్న పెద్ద బ్యాట్ మీద ఆటగాళ్లు ఒక్కొక్కరుగా సంతకాలు చేశారు. ప్రస్తుతం ద్వైపాక్షిక సిరీస్‌లో భారత జట్టు టైటిల్ స్పాన్సర్‌గా కంపా, ఎస్బీఐ లైఫ్, చాట్‌జీపీటీలు ఉన్నాయి. ఇప్పుడు వీటి సరసన ముత్తూట్ ఫిన్‌కార్ప్ కూడా చేరనుంది. రెండేళ్ల కాలానికి బీసీసీఐతో ముత్తూట్ సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. అంటే.. 2028 మార్చి 31 వరకూ ఈ హోదాలో కొనసాగనుందీ కొచ్చికి చెందిన ఫైనాన్స్ కంపెనీ.
Virat Kohli and Team India signed a special bat during the Muthoot FinCorp event ! 🩵 pic.twitter.com/gA8b4uISvU
— Virat Kohli Fan Club (@Trend_VKohli) September 26, 2026
సొంతగడ్డపై త్వరలో వెస్టిండీస్‌తో జరుగనున్న వన్డే సిరీస్‌తో టీమిండియా టైటిల్ స్పాన్సర్‌గా ముత్తూట్ ప్రయాణం మొదలవ్వనుంది. అక్టోబర్ 16 నుంచి విండీస్‌తో వన్డే సిరీస్ నుంచి బ్లూ ముత్తూట్ పేరుతో ఈ కంపెనీ పేరు మరింత మందికి చేరువకానుంది. ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన బీసీసీఐ టైటిల్ స్పాన్సర్షిప్ హక్కులకు ముత్తూట్ ఫైనాన్స్ భారీగానే ఖర్చు చేసింది. టీమిండియా ఒక్కో మ్యాచ్‌కు కనీస ధర రూ.4.85 కోట్లు కాగా.. బేరసారాల అనంతరం ఈ మొత్తం కాసింత తగ్గనుంది. 2028 మార్చి 31 వరకూ రెండేళ్లలో.. టీమిండియా స్వదేశంలో 35 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడనుంది. వీటిలో 10 టెస్టులు, 12 వన్డేలు, 13 టీ20లు ఉన్నాయి. ఈ మ్యాచుల్లో భారత క్రికెటర్ల జెర్సీపై ముత్తూట్ ఫిన్‌కార్ప్ పేరు మెరవనుంది.