‘వర్షాభావంతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలి’
వర్షాభావంతో తీవ్రంగా నష్టపోయిన రైతులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని విధాలుగా ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ ఏఐపీకేఎస్ ఆధ్వర్యంలో బుధవారం దమ్మపేట డిప్యూటీ తాసీల్దార్కు డిమాండ్లతో కూడిన వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా అఖిల భారత ఐక్య రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి...
– భద్రాద్రి కొత్తగూడెం ఏఐపీకేఎస్ జిల్లా కార్యదర్శి అమర్లపూడి రాము
దమ్మపేట, ఆగస్టు 05 : వర్షాభావంతో తీవ్రంగా నష్టపోయిన రైతులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని విధాలుగా ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ ఏఐపీకేఎస్ ఆధ్వర్యంలో బుధవారం దమ్మపేట డిప్యూటీ తాసీల్దార్కు డిమాండ్లతో కూడిన వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా అఖిల భారత ఐక్య రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి అమర్లపూడి రాము మాట్లాడుతూ.. ప్రత్యామ్నాయ పంటల సాగుకు ఉపయోగపడే స్వల్పకాలిక పంట విత్తనాలు ఉచితంగా అందించాలన్నారు. రైతుల రుణాలు పూర్తిగా రద్దు చేసి ఒకేసారి రుణమాఫీ చేయాలన్నారు. అలాగే కొత్తగా వడ్డీ లేని పంట రుణాలు ఇచ్చి పంట బీమా అమలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రగతిశీల మహిళా సంఘం డివిజన్ కార్యదర్శి తోడం దుర్గమ్మ, కారం సంధ్య ,అఖిల భారత ఐక్య రైతు పాల్వంచ డివిజన్ అధ్యక్ష, కార్యదర్శులు పండూరి వీరబాబు, నకిరేకంటి నాగేశ్వరరావు, రాయబారపు వెంకటేశ్వర్లు, ఊకే అప్పారావు, కుంజ కాంతారావు, ఎర్రగొర్ల రామారావు, తమ రాముడు, కుంజ పాపారావు, గంగాధర నాగమణి, బండి ఆదినారాయణ, సోయం సీతారాములు, కాక రాజు, దొంగ లక్ష్మీనారాయణ, బాదంపరుపు మహేష్ పాల్గొన్నారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Paper Leak | 8 ఏండ్లుగా పేపర్ లీక్లే లేవట.. NTAపై కేంద్ర విద్యా శాఖ నివేదిక
Reservations | మతం మారితే రిజర్వేషన్ వర్తించదు.. సుప్రీంకోర్టు కీలక తీర్పు
Non Veg | నాన్వెజ్ తినే మహిళలు వందేళ్లు బతుకుతారంట.. సర్వేలో ఆసక్తికర విషయాలు వెల్లడి
Farmers | పంటలు ఎండిపోతున్నా పట్టింపు లేదా.. అన్నదాతల ఆగ్రహం
Gang Rape | మహిళపైనా ‘గ్యాంగ్ రేప్’ కేసు పెట్టొచ్చు.. ఢిల్లీ హైకోర్టు చరిత్రాత్మక తీర్పు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

