చెన్నై: కుటుంబ గొడవల వల్ల ఒక వ్యక్తి తన భార్యను కొట్టాడు. తీవ్రంగా గాయపడిన ఆమె ఆసుపత్రిలో చేరింది. అక్కడకు వెళ్లిన భర్త తన భార్యను కత్తితో పొడిచి హత్య చేశాడు. (Man Stabs Wife In Hospital) ఆ తర్వాత హాస్పిటల్ నుంచి పారిపోయాడు. తమిళనాడులోని కరూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. కులితలైకు చెందిన విశ్రుత్, అతడి భార్య శ్రుతి మధ్య శనివారం రాత్రి వాగ్వాదం జరిగింది. ఈ నేపథ్యంలో జరిగిన గొడవలో భార్య గాయపడింది. అస్వస్థతకు గురైన శ్రుతిని చికిత్స కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
కాగా, ఆదివారం ఉదయం విశ్రుత్ తన భార్య శ్రుతిని చూసేందుకు ఆ ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్నాడు. అయితే రహస్యంగా దాచి వెంట తెచ్చిన కత్తితో ఆమెను పొడిచి చంపాడు. అక్కడున్న మిగతా రోగులు, ఆసుపత్రి సిబ్బంది ఇది చూసి షాక్ అయ్యారు. విశ్రుత్‌ను పట్టుకునేందుకు ప్రయత్నించగా తప్పించుకుని అక్కడి నుంచి పారిపోయాడు.
మరోవైపు ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్నారు. శ్రుతి హత్యపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పరారైన ఆమె భర్త విశ్రుత్‌ను అరెస్ట్ చేసేందుకు పోలీస్ బృందాలను ఏర్పాటు చేసినట్లు పోలీస్ అధికారి తెలిపారు.
Also Read:
Kanwariyas | సీఆర్పీఎఫ్ జవాన్‌ను కొట్టి, కాళ్లతో తన్నిన కన్వారియాలు.. వీడియో వైరల్
Watch: భారీ వర్షాలు, వరదలకు రోడ్డుపైకి కొట్టుకొచ్చిన చేపలు.. తర్వాత ఏం జరిగిందంటే?