జైపూర్: భారీ వర్షాలు, వరదలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కాలువలు, చెరువులు పొంగిపొర్లాయి. దీంతో చెరువుల్లోని చేపలు రోడ్లపైకి కొట్టుకువచ్చాయి. (Fish Flood Streets) ఈ నేపథ్యంలో చేపలను పట్టుకునేందుకు కొందరు వ్యక్తులు ప్రయత్నించారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. గత రెండు రోజులుగా రాజస్థాన్లో కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రాజధాని జైపూర్తోపాటు పలు జిల్లాల్లోని ప్రాంతాలు, గ్రామాలు జలమయమయ్యాయి. నదులు, డ్రైనేజీలు, ఆనకట్టలు పొంగిపొర్లడంతో అనేక గ్రామాలకు సంబంధాలు తెగిపోయాయి. శనివారం కురిసిన భారీ వర్షం కారణంగా జోధ్పూర్-జైపూర్ హైవేలోని బనాద్ రోడ్డు మునిగిపోయింది. దీంతో వందలాది వాహనదారులు రహదారిలో చిక్కుకుపోయారు.
కాగా, రాజస్థాన్లోని నాగౌర్ జిల్లా అతలాకుతలమైంది. భారీ వర్షాలకు లంపోలై చెరువు పొంగిపొర్లింది. దీంతో వరద నీటి ప్రవాహం వల్ల ఆ చెరువులోని చేపలు రోడ్లపైకి కొట్టుకువచ్చాయి. పదుల సంఖ్యలో చేపలు రహదారులపై ఈదుతూ కనిపించాయి. ఇది చూసి స్థానికులు ఆశ్చర్యపోయారు. మరికొందరు ఆ చేపలను పట్టేందుకు ప్రయత్నించారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
नागौर में सड़कों पर तैरने लगीं मछलियां!!
नागौर के रियाबड़ी गांव में लगातार बारिश से #लाम्पोलाई_तालाब ओवरफ्लो हो गया जिससे तालाब की मछलियां 🐟 🐠 बाहर निकलकर सड़कों पर तैरती नजर आईं, लोगों का कहना है कि उन्होंने अपने जीवन में ऐसी बारिश कभी नहीं देखी#Weather #Nagaur #Rajasthan pic.twitter.com/DJZ4xvL3bJ
— Vinod Bhojak (@VinoBhojak) July 20, 2025
Also Read:
Watch: వర్షం నీటి ప్రవాహంలో కొట్టుకుపోయిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: పామును పట్టి మెడలో వేసుకుని బైక్పై వెళ్లిన వ్యక్తి.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?