Oscar Awards 2026 | హాలీవుడ్ సినీ ప్రపంచంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డుల వేడుకగా పేరుగాంచిన 98వ అకాడమీ అవార్డ్స్ ఈసారి కూడా అట్టహాసంగా జరిగింది. ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానుల దృష్టిని ఆకర్షించిన ఈ అవార్డుల కార్యక్రమంలో పలు చిత్రాలు వివిధ విభాగాల్లో అవార్డులను సొంతం చేసుకుని ప్రత్యేక గుర్తింపు పొందాయి. ముఖ్యంగా ‘ఫ్రాంకెన్‌స్టైన్’, ‘వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్’, ‘సిన్నర్స్’ వంటి చిత్రాలు పలు కేటగిరీల్లో విజేతలుగా నిలిచి ఈ ఏడాది అవార్డుల వేడుకలో తమదైన ముద్ర వేశాయి.
ఈ వేడుకలో టెక్నికల్ విభాగాల్లో ‘ఫ్రాంకెన్‌స్టైన్’ చిత్రం విశేషంగా మెరిసింది. ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్ విభాగంలో ఈ చిత్రం అవార్డును దక్కించుకుంది. ఈ చిత్రానికి టమారా డెవరెల్ ప్రొడక్షన్ డిజైన్ నిర్వహించగా, షేన్ వియో సెట్స్ బాధ్యతలను సమర్థంగా నిర్వహించారు. ఈ విభాగంలో ‘హామ్నెట్’, ‘మార్టీ సుప్రీమ్’, ‘వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్’, ‘సిన్నర్స్’ చిత్రాలు కూడా నామినేషన్లు పొందాయి. అలాగే విజువల్ ఎఫెక్ట్స్ విభాగంలో ‘అవతార్: ఫైర్ అండ్ అష్’ చిత్రం విజేతగా నిలిచి మరోసారి తన సాంకేతిక ప్రతిభను చాటుకుంది. ఈ చిత్రానికి జో లెటెరి, రిచర్డ్ బెనెహామ్, ఎరిక్ సైన్డన్, డానియెల్ బారెట్ విజువల్ ఎఫెక్ట్స్ అందించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.
ఈ ప్రతిష్టాత్మక వేడుకకు హాలీవుడ్‌తో పాటు ఇతర ఇండస్ట్రీలకు చెందిన సెలబ్రిటీలు హాజరై సందడి చేశారు. కళ్లు చెదిరే ఔట్‌ఫిట్స్‌ను ధరించి రెడ్‌కార్పెట్‌పై మెరవగా, వారికి సంబంధించిన పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా తన భర్తతో కలిసి రెడ్ కార్పెట్‌పై మెరవడం అందరి దృష్టిని ఆకర్షించింది..
విజేతల జాబితా చూస్తే..
ఉత్తమ సహాయ నటి: ఎమీ మాడిగన్ (వెపన్స్)
ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్: కెపాస్ డెమన్ హంట్స్
ఉత్తమ యానిమేటెడ్ షార్ట్ ఫిల్మ్: ది గర్ల్ హు క్రైడ్ పెరల్స్
ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్: ఫ్రాంకిన్ స్టన్
ఉత్తమ మేకప్ అండ్ హెయిర్ స్టైలింగ్: ఫ్రాంకిన్ స్టన్
ఉత్తమ క్యాస్టింగ్: వన్ బ్యాటిల్ ఆప్టర్ అనదర్
ఉత్తమ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్: ది సింగర్స్, టూ పీపుల్ ఎక్ఛ్సేంజ్ సలైవా
ఉత్తమ స్క్రీన్‌ప్లే : ర్యాన్ కూగ్లర్
ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్‌ప్లే: సిన్నర్స్
ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్: మిస్టర్. నోబడీ ఎగనెస్ట్ పుతిన్
ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్: ఆల్ ది ఎంప్టీ రూమ్స్