చండీగఢ్: ఆపరేషన్ సిందూర్ సమయంలో పదేళ్ల బాలుడు ఆర్మీకి సహకరించాడు. పాకిస్థాన్ సైనికుల కాల్పులకు ధీటుగా సమాధానం ఇచ్చిన ఆర్మీ జవాన్లకు ఆహారం, తాగు నీరు వంటివి అందించాడు. (Army To Sponsor Brave Boy’s Education) ఆ బాలుడి ధైర్యసాహసాలను ఆర్మీ ప్రశంసించింది. అతడి చదువుకు సహకరించేందుకు ముందుకు వచ్చింది. ఏప్రిల్ 22న జమ్ముకశ్మీర్‌లోని పహల్గామ్లో పర్యాటకులపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 26 మంది ప్రాణాలు కోల్పోయారు.
కాగా, దీనికి ప్రతీకారంగా మే 7న ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో సైనిక చర్యను భారత్ చేపట్టింది. పాక్‌లోని ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసింది. ఈ సందర్భంగా పంజాబ్‌లోని సరిహద్దు ప్రాంతాల్లో పాక్ సైన్యం కాల్పులకు పాల్పడింది. దీంతో భారత ఆర్మీ ధీటుగా తిప్పికొట్టింది. సరిహద్దు గ్రామమైన తారావాలికి చెందిన పదేళ్ల ష్వాన్ సింగ్ ఈ సందర్భంగా భారత సైనికులకు సహరించాడు. పాక్ సైన్యంపై కాల్పుల్లో బిజీగా ఉన్న జవాన్లకు ఆహారం, తాగునీరు, టీ, పాలు, లస్సీ, ఐస్ వంటివి ఒంటరిగా అందించాడు. పెద్దవాడైన తర్వాత తాను కూడా సైన్యంలో చేరుతానని ఆ బాలుడు నాడు మీడియాతో అన్నాడు.
మరోవైపు 4వ తరగతి చదువుతున్న ష్వాన్ సింగ్ సేవలను భారత ఆర్మీ ప్రశంసించింది. అతడ్ని హీరోగా అభివర్ణించింది. ఆ బాలుడి ధైర్యం, ఉత్సాహాన్ని గోల్డెన్ యారో డివిజన్ కొనియాడింది. అతడి చదువుకు సహకరిస్తామని ప్రకటించింది. శనివారం ఫిరోజ్‌పూర్ కంటోన్మెంట్లో జరిగిన కార్యక్రమంలో వెస్ట్రన్ కమాండ్ జనరల్ ఆఫీసర్, కమాండింగ్-ఇన్-చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ కుమార్ కటియార్ ఆ బాలుడిని సత్కరించారు.
Also Read:
Pilot Rape Air Hostess | ఎయిర్ హోస్టెస్‌పై పైలట్ అత్యాచారం.. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు
Man Stabs Wife In Hospital | భార్యను కొట్టడంతో ఆసుపత్రిపాలు.. అక్కడికెళ్లి కత్తితో పొడిచి చంపిన భర్త