ముంబై: పైలట్ ఒక ఎయిర్ హోస్టెస్‌పై అత్యాచారానికి పాల్పడ్డాడు. (Pilot Rape Air Hostess) బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న ఆ పైలట్‌ను అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. మహారాష్ట్రలోని థానే జిల్లాలో ఈ సంఘటన జరిగింది. పైలట్, 23 ఏళ్ల ఎయిర్ హోస్టెస్ ఒక ప్రైవేట్ ఎయిర్‌లైన్స్‌లో పని చేస్తున్నారు. ముంబై సమీపంలోని మీరా రోడ్లో వేర్వేరుగా వారిద్దరూ నివసిస్తున్నారు. ముంబై నుంచి లండన్ వెళ్లిన విమానంలో వారిద్దరూ విధులు నిర్వహించారు.
కాగా, ముంబైకు తిరిగి వచ్చిన తర్వాత ఆ పైలట్, ఎయిర్ హోస్టెస్ కలిసి మీరా రోడ్డులోని తమ ఇళ్లకు ఒకే వాహనంలో చేరుకున్నారు. ఈ సందర్భంగా పైలట్ తన ఇంటికి ఆమెను ఆహ్వానించాడు. అయితే అతడి ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఎయిర్ హోస్టెస్‌పై అత్యాచారానికి పాల్పడ్డాడు.
మరోవైపు బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్న ఆ పైలట్‌ను అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు పోలీస్ అధికారి వెల్లడించారు.
Also Read:
Watch: పామును పట్టి మెడలో వేసుకుని బైక్‌పై వెళ్లిన వ్యక్తి.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?