Rains : తెలంగాణ రాష్ట్రంలో ఆది, సోమవారాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదివారం ఉత్తర, పశ్చిమ జిల్లాల్లో 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడాని వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని పేర్కొన్నది.
ద్రోణి ప్రభావంతో తూర్పు, ఆగ్నేయ దిశల నుంచి వీస్తున్న తేమ గాలులతో వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఉదయం నుంచే ఆకాశం మేఘావృతమై చల్లని గాలులు వీస్తున్నాయని తెలిపింది.