Mahesh Bigala | ఆస్ట్రేలియాలోని స్ట్రాత్ఫీల్డ్ మేయర్గా శాండీ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తెలంగాణ నుంచి ఆస్ట్రేలియాలో మేయర్గా ఎన్నికైన తొలి వ్యక్తిగా ఆమె గుర్తింపు పొందారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ ఎన్నారై కోఆర్డినేటర్ మహేశ్ బిగాల ఆమెకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. మేయర్గా ఆమె పదవీకాలం విజయవంతంగా సాగాలని ఆకాంక్షించారు.
స్ట్రాత్ఫీల్డ్లోని హోమ్బుష్ పార్కులో భారత మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు విగ్రహ ఏర్పాటు కోసం శాండీ రెడ్డి సహకారం అందించారు. తెలుగు సమాజానికి సంబంధించిన ఈ కార్యక్రమంలో తోడ్పాటునందించిన ఆమె మేయర్గా ఎన్నిక కావడం పట్ల హర్షం వ్యక్తమవుతోంది.

Allu Arjun | భార్యతో అల్లు అర్జున్ రొమాంటిక్ మూమెంట్.. స్నేహారెడ్డికి బన్నీ స్పెషల్ విషెస్ వైరల్!
Srinivas Reddy | ప్రజలవిశ్వాసమే.. జర్నలిస్టులకు రక్షణ.. ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి
కడు పేదరికం నుండి యువ ద్రోణాచార్యుడిగా పొన్నాల పృథ్వీరాజ్