Supreme Court : క్యాన్సర్ వ్యాధి (Cancer Decease) కి వినియోగించే ఔషధాల (Medicine) ను అధిక ధరకు విక్రయిస్తుండటంపై సుప్రీంకోర్టు (Supreme Court) తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. క్యాన్సర్ ఔషధాల అధికర ధరలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై జస్టిస్ సందీప్ మెహతా (Justice Sandeep Mehta), జస్టిస్ విక్రమ్‌నాథ్ (Justice Vikramnath) ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది. రిటైలర్లకు కేవలం రూ.2,700కే సరఫరా అవుతున్న ఒక క్యాన్సర్ ఔషధంపై రూ.27 వేల ఎంఆర్పీ ముద్రించడం దిగ్భ్రాంతికరమని పేర్కొన్నది.
అసలు ధరకు, ఎమ్మార్పీకి ఇంత అంతరం ఉండటం దోపిడీకి ఆస్కారం ఇస్తుందని వ్యాఖ్యానించింది. మందులపై ఏకరీతిగా 16 శాతం మార్జిన్ ఉండాలని సూచించింది. అదేవిధంగా తమ మెడికల్ దుకాణాల నుంచే మందులు కొనాలంటూ ఆస్పత్రులు నిర్దేశించడంపై కూడా సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. దీనిపై కూడా దృష్టి సారించాలని కేంద్రానికి సూచించింది. ఈ విధానంవల్ల సామాన్యుడే నష్టపోతున్నాడని పేర్కొన్నది.