KTR | ఇప్పటికే చాలాసార్లు చెప్పా.. నేను డ్రగ్స్ టెస్ట్‌కు రెడీ.. కేటీఆర్ సీరియస్
KTR | డ్రగ్స్ మనుషులను రాక్షసులుగా మారుస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. బాధ్యతాయుతమైన స్థానాల్లో ఉన్న వ్యక్తులే మాదక ద్రవ్యాలకు అలవాటు పడటం దురదృష్టకరమని పేర్కొన్నారు. డ్రగ్స్, ఇతర మాదక ద్రవ్యాలకు తాను పూర్తిగా వ్యతిరేకమని స్పష్టం చేశారు.
KTR | డ్రగ్స్ మనుషులను రాక్షసులుగా మారుస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. బాధ్యతాయుతమైన స్థానాల్లో ఉన్న వ్యక్తులే మాదక ద్రవ్యాలకు అలవాటు పడటం దురదృష్టకరమని పేర్కొన్నారు. డ్రగ్స్, ఇతర మాదక ద్రవ్యాలకు తాను పూర్తిగా వ్యతిరేకమని స్పష్టం చేశారు.
డ్రగ్స్ వినియోగాన్ని బీఆర్ఎస్ కూడా తీవ్రంగా ఖండిస్తుందని కేటీఆర్ తెలిపారు. ఎవరైనా డ్రగ్స్ వినియోగించినా, అక్రమంగా విక్రయించినా, వారికి ఎలాంటి రాజకీయ పలుకుబడి ఉన్నప్పటికీ వారిని చట్ట ప్రకారం కఠినంగా శిక్షించాలని సూచించారు. అయితే డ్రగ్స్కేసును రాజకీయంగా ఉపయోగిస్తూ బీఆర్ఎస్ పార్టీని లాగడం అత్యంత దారుణమైన రాజకీయాలు అని కేటీఆర్ మండిపడ్డారు. ఈ కేసును బీఆర్ఎస్పై కక్ష సాధింపు చర్యలకు వాడుతున్నారని విమర్శించారు.
నేను ఎప్పుడైనా డ్రగ్స్ టెస్ట్‌కు సిద్ధంగా ఉన్నానని కేటీఆర్ పునరుద్ఘాటించారు. డ్రగ్స్ టెస్ట్‌కు సిద్ధమని ఇప్పటికే చాలాసార్లు చెప్పానని గుర్తుచేశారు. అన్ని రాజకీయ పార్టీల నాయకులు డ్రగ్స్ టెస్ట్ చేయించుకోవాలని మహేశ్ కుమార్ గౌడ్ చేసిన ప్రతిపాదనను స్వాగిస్తున్నానని తెలిపారు. ప్రజా ప్రతినిధులు ముందుండి ఆదర్శంగా నిలబడాలన్నారు.
ఇక, ప్రతి డ్రగ్స్ కేసులో తన పేరును వాడటంపై కేటీఆర్ తీవ్రంగా మండిపడ్డారు. ఇకపై తన పేరును డ్రగ్స్ కేసులో అనవసరంగా లాగితే చట్టపరమైన నోటీసులు ఇస్తామని హెచ్చరించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Srivari Temple | ఖమ్మంలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి శ్రీకారం..పవిత్ర క్రతువును నిర్వహించిన త్రిదండి చిన్నజీయర్‌స్వామి
Srisailam Dam | శ్రీశైలం డ్యామ్‌కు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
Yash | సర్దార్ డైరెక్టర్‌తో యశ్ సినిమా.. క్రేజీ టాక్ నిజమయ్యేనా..?
Ollie Robinson | పాకిస్థాన్‌పై నిప్పులు.. మూడేళ్లకు మళ్లీ సెంట్రల్ కాంట్రాక్ట్..!
Fake CISF DSP | ఎయిర్‌పోర్ట్‌లో ఉద్యోగాలు, చౌకగా ఐఫోన్లు ఇప్పిస్తానంటూ మోసం.. నకిలీ సీఐఎస్ఎఫ్ డీఎస్పీ అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

