KTR | టెన్త్ విద్యార్థులకు కేటీఆర్ కానుక.. సిరిసిల్లలో 3171 మందికి పరీక్ష సామగ్రి పంపిణీ
KTR | పదో తరగతి వార్షిక పరీక్షలు రాయబోతున్న ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ చిరు కానుక అందజేస్తున్నారు. 'గిఫ్ట్ ఏ స్మైల్' ద్వారా ఏటా ఈ కానుక ఇస్తున్న విషయం తెలిసిందే
KTR | పదో తరగతి వార్షిక పరీక్షలు రాయబోతున్న ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ చిరు కానుక అందజేస్తున్నారు. ‘గిఫ్ట్ ఏ స్మైల్’ ద్వారా ఏటా ఈ కానుక ఇస్తున్న విషయం తెలిసిందే కాగా, ఈ సారి సిరిసిల్ల నియోజకవర్గంలోని 3,171 మంది విద్యార్థులకు పరీక్ష సామగ్రి నేటి నుంచి అందజేయనున్నారు. ముందుగా శుభాకాంక్షలు చెప్పారు. ఆత్మవిశ్వాసంతో ఒత్తిడి లేకుండా పరీక్షలు రాసి విజయం సాధించాలని సూచించారు.
రాజన్న సిరిసిల్ల, మార్చి 5 (నమస్తే తెలంగాణ)/ సిరిసిల్ల టౌన్ : టెన్త్ పరీక్షలు ఈ నెల 14 నుంచి ప్రారంభం కానుండగా, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చిరు కానుక అందించబోతున్నారు. ‘గిఫ్ట్ ఏ స్మైల్’ కింద ఎప్పటిలాగే ఈసారి సిరిసిల్ల నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పరీక్ష సామగ్రి అందించనున్నారు. సిరిసిల్ల పట్టణంలోని 17 పాఠశాలల్లో 1056 మంది, గంభీరావుపేట మండలంలోని 15 పాఠశాలల్లో 547 మంది, ఎల్లారెడ్డిపేట మండలంలోని 10 పాఠశా లల్లో 444 మంది, ముస్తాబాద్ మండలంలోని 10 పాఠ
శాలల్లో 486 మంది, తంగళ్లపల్లి మండలంలోని 11 పాఠశాలల్లో 517 మంది, వీర్నపల్లి మండలంలోని 2 పాఠశాలల్లో 121 మంది విద్యార్థులకు నేటి నుంచి పంపిణీ చేయనున్నారు. సిరిసిల్ల గీతానగర్ జడ్పీహెచ్ఎస్ బాలికల పాఠశాల, కుసుమ రామయ్య ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో శుక్రవారం పరీక్ష సామగ్రి అందిస్తా మని బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి తెలిపారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. పదో తరగతి విద్యార్థులు పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు.
Read Today's Latest Karimnagar Karimnagar News in Telugu and Telugu News
- Tags
- Gift a smile
- KTR
- siriclla
- SSC Exams
RELATED ARTICLES
తాజా వార్తలు
Greater Noida | టీ, నూడుల్స్ కారణం కాదు.. ఆ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది..!
Bigg Boss 10 | బిగ్బాస్ తెలుగు 10లో ఊహించని ట్విస్ట్.. ఈ వారం నో ఎలిమినేషన్,సీక్రెట్ రూమ్లోకి షాలిని!
Kolkata Stampede | ‘తొక్కిసలాట ఎలా జరిగింది’.. బాధితులను పరామర్శించిన కేంద్ర హోంమంత్రి, బెంగాల్ సీఎం.. Video
The Paradise | ఓటీటీలోకి ‘ది ప్యారడైజ్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Kolkata stampede | తొక్కిసలాట ఘటనపై రాష్ట్రపతి, ప్రధాని సంతాపం.. రూ.2 లక్షల పరిహారం ప్రకటించిన ప్రధాని
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

