పురుగులమందు వినియోగంలో తెలంగాణ టాప్
పండ్లు, కూరగాయల్లో పురుగులమందుల వినియోగంలో తెలంగాణ దేశంలోనే టాప్లో నిలిచింది. లోక్సభలో కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ వివరాలు వెల్లడించింది.
- పండ్లు, కూరగాయల్లో మోతాదుకు మించి అవశేషాలు
- వెల్లడించిన కేంద్ర వ్యవసాయ శాఖ
హైదరాబాద్, ఆగస్టు 14 (నమస్తే తెలంగాణ) : పండ్లు, కూరగాయల్లో పురుగులమందుల వినియోగంలో తెలంగాణ దేశంలోనే టాప్లో నిలిచింది. లోక్సభలో కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ వివరాలు వెల్లడించింది. రాష్ట్రంలో 8,198 పండ్లు, కూరగాయల శాంపిల్స్ సేకరించి పరిశీలించగా.. అందులో 486 నమునాల్లో ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఎఫ్ఎస్ఎస్ఏఐ) నిర్ణయించిన మోతాదుకంటే పరిమితికి మించి అవశేషాలు ఉన్నట్టు కేంద్రం వెల్లడించింది.
కర్ణాటక ఈ జాబితాలో రెండో స్థానంలో నిలిచినట్టు కేంద్రం తెలిపింది. మొత్తం 9,176 శాంపిల్స్ పరిశీలించగా.. 334 నమునాల్లో మోతాదుకు మించి పురుగులమందుల అవశేషాలు ఉన్నట్టు తేలింది. ఈ జాబితాలో మహారాష్ట్ర మూడో స్థానంలో నిలిచింది. మొత్తం 5,295 శాంపిల్స్ పరిశీలించగా.. 260 నమునాల్లో మోతాదుకు మించి పురుగులమందుల అవశేషాలు ఉన్నట్టు కేంద్రం పార్లమెంట్కు నివేదించింది. 2023-26 మధ్య కాలంలో దేశంలోని 23 రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి మొత్తం 70,652 శాంపిల్స్ పరిశీలించినట్టు వెల్లడించింది. ఇందులో 2,223 నమునాల్లో అధిక మోతాదులో పురుగులమందుల అవశేషాలు ఉన్నట్టు కేంద్రం తెలిపింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jammu and Kashmir | జమ్మూ కాశ్మీర్లో అక్రమ చొరబాటుకు యత్నం.. ఇద్దరు ఉగ్రవాదుల కాల్చివేత
Vijayan: మాజీ సీఎం విజయన్ ఇంటికి నోటీసులు అతికించిన ఈడీ
Girl | ఈ యువతి కారుపై ఎక్కి ఏం చేస్తుందో చూడండి.. వీడియో
Music Director Deva | చిత్ర పరిశ్రమలో విషాదం.. ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
Mahela Jayawardene | హెడ్ కోచ్ జయవర్ధనేతో బంధానికి తెర.. కొత్త హెడ్కోచ్ కోసం ముంబై ఇండియన్స్ కసరత్తు..!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

