న్యూఢిల్లీ: దేశ రాజధానిలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పలు రోడ్లు జలమయమయ్యాయి. ఈ నేపథ్యంలో ఒక వ్యక్తి, కొందరు పిల్లలు ఈతకొట్టారు. (Man swims in waterlogged Delhi road) ఢిల్లీలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంపై ఆప్ నేతలు మండిపడ్డారు. ఢిల్లీలో బుధవారం కురిసిన భారీ వర్షానికి పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. వర్షం నీటితో రోడ్లు నిండిపోయాయి.
కాగా, పశ్చిమ వినోద్ నగర్‌లోని రోడ్డులో నడుం లోతుకుపైగా వర్షం నీరు నిలిచింది. దీంతో ఒక వ్యక్తి ఆ నీటిలో ఈతకొట్టాడు. కొందరు పిల్లలు కూడా ఆ నీటిలో ఆడారు. పట్పర్గంజ్లోని జాతీయ రహదారి 24లో గాలి టబ్‌లో ఒక మహిళ విహరించింది. ‘మేం పశ్చిమ వినోద్ నగర్లో ఉన్నాం. ఇక్కడ నీరు నిలిచిపోలేదని మా ఎమ్మెల్యే చెబుతున్నారు. నేను ఈత కొట్టి మీకు చూపిస్తా’ అని ఒక వ్యక్తి స్థానిక బీజేపీ ఎమ్మెల్యేపై మండిపడ్డాడు.
మరోవైపు ఢిల్లీ మాజీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎమ్మెల్యే అతిషి, ఆ పార్టీ నేతలతోపాటు కాంగ్రెస్ నేతలు కూడా ఈ వీడియో క్లిప్స్‌ను సోషల్ మీడియాలో షేర్ చేశారు. సీఎం రేఖా గుప్తా నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వాన్ని వారు దుయ్యబట్టారు. ‘ఢిల్లీలో చాలా స్విమ్మింగ్ పూల్స్ ప్రారంభించినందుకు సీఎం రేఖా గుప్తాకు అభినందనలు’ అని విమర్శించారు.
Congrats to CM @gupta_rekha jii 🙏 for making Delhi roads turning into swimming pools after just 10 minutes of rain! 🌧️🏊♂️ #MonsoonAchievement #DelhiFloods #ModiHaiToMumkinHai #BJPModel pic.twitter.com/UWqyfZQUc6
— Jayanth Nayee (@JayanthNayee) July 23, 2025
Also Read:
Air India Crash | తప్పుడు మృతదేహాలు చేరాయి.. బ్రిటన్ కుటుంబాలు ఆరోపణ
Fake embassy | నకిలీ రాయబార కార్యాలయం, ఫ్యాన్సీ దౌత్య కార్లు.. ఒక వ్యక్తి అరెస్ట్
Watch: సరదాగా కారు నడిపిన పిల్లలు.. తర్వాత ఏం జరిగిందంటే?