Gaddar Awards 2025 | కళాకారుల ప్రతిభకు పట్టం కట్టే ప్రతిష్టాత్మక గద్దర్ అవార్డులను (2025 సంవత్సరానికి గాను) శనివారం అధికారికంగా ప్రకటించారు. ఈ ఏడాది స్పెషల్ జ్యూరీ అవార్డుల వివరాలను ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ వెల్లడించారు. 2025 జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు సెన్సార్ పూర్తి చేసుకున్న చిత్రాలను, షార్ట్ ఫిల్మ్‌లను ఈ పురస్కారాలకు ఎంపిక చేశారు. తెలుగు చిత్రసీమకు అందించిన సేవలకు గాను మెగాస్టార్ చిరంజీవిని ‘ఎన్టీఆర్ జాతీయ పురస్కారం’తో ప్రభుత్వం గౌరవించనుంది. అలాగే కమల్ హాసన్‌కు పైడి జయరాజ్ అవార్డు, జయసుధకు ఏఎన్నార్ పురస్కారం, ప్రముఖ నిర్మాత అశ్విని దత్‌కు నాగిరెడ్డి చక్రపాణి అవార్డు. సుద్దాల అశోక్ తేజకు సినారే అవార్డు దక్కాయి.
ఫీచర్ ఫిల్మ్స్ విభాగంలో ‘రాజు వెడ్స్ రాంబాయి’ ఉత్తమ చిత్రంగా నిలవగా, నాగచైతన్య, రష్మిక మందన్న ఉత్తమ నటీనటులుగా ఎంపికయ్యారు.
విజేతలు
ఉత్తమ చిత్రం – రాజు వెడ్స్ రాంబాయి
ఉత్తమ ద్వితీయ చిత్రం – దండోరా
ఉత్తమ తృతీయ చిత్రం – ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్‌షో
ఉత్తమ నటుడు – నాగ చైతన్య తండేల్
ఉత్తమ నటి – రష్మిక ది గర్ల్‌ఫ్రెండ్
ఉత్తమ దర్శకుడు – సాయిలు (రాజు వెడ్స్ రాంబాయి)
ఉత్తమ ప్రజాదరణ చిత్రం – సంక్రాంతికి వస్తున్నాం
ఉత్తమ సహాయ నటుడు – శివాజీ (దండోరా)
ఉత్తమ సహాయ నటి – భూమిక (యూఫోరియా)
ఉత్తమ సంగీత దర్శకుడు – మార్క్ రాబిన్ (దండోరా)
ఉత్తమ గాయకుడు – అనురాగ్ కులకర్ణి (రాజు వెడ్స్ రాంబాయి)
ఉత్తమ గాయని – సాహితీ (కన్నప్ప)
ఉత్తమ బాలనటుడు – మాస్టర్ రోహన్ (ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో)
నేషనల్ ఇంటిగ్రేషన్ ఫిల్మ్: తండేల్.
సామాజిక స్పృహ కలిగిన చిత్రం: కోర్ట్.
ఉత్తమ పరిచయ దర్శకుడు: సాయి మార్తాండ్ (లిటిల్ హార్ట్స్).
ఉత్తమ బాలల చిత్రం & నటుడు: ‘అనగనగా’ (చిత్రం)