హైదరాబాద్: కూకట్‌పల్లిలో వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠాను శనివారం సైబరాబాద్ పోలీసులు(Cyberabad Police) పట్టుకున్నారు. వ్యభిచార ముఠా నిర్వహిస్తున్న ఇద్దరితో పాటు మరో అయిదు మంది కస్టమర్లను అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ముఠాకు చెందిన మరో ఇద్దరు మహిళలను రెస్క్యూ చేసినట్లు చెప్పారు. ఓ సమాచారం ఆధారంగా సైబరాబాద్‌కు చెందిన ఏహెచ్‌టీయూ బృందం రెయిడ్ నిర్వహించింది. సుమిత్రానగర్‌లో ఉన్న ఇండ్లపై దాడి నిర్వహించారు. రాకెట్ నడుపుతున్న వారితో పాటు కస్టమర్లను అదుపులోకి తీసుకున్నారు. సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్‌ల ద్వారా కస్టమర్లను ఆకట్టుకుంటున్నట్లు గుర్తించారు. వారి నుంచి అధిక మొత్తంలో డబ్బులు వసూల్ చేస్తున్నట్లు తేల్చారు. భారీ మొత్తంలో డబ్బు వసూల్ చేసినా.. బాధితులకు మాత్రం తక్కువే ఇస్తున్నట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశారు.