జైపూర్: తన చెల్లితో కలిసి భర్త ఒక చోట ఉండటాన్ని అతడి భార్య చూసింది. దీంతో వారిద్దరి మధ్య వివాహేతర సంబంధం ఉందని ఆమె అనుమానించింది. భర్త చొక్కా పట్టుకుని నిలదీయడంతోపాటు అతడి చెంపలు వాయించింది. (Woman Beats Up Husband) ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో ఈ సంఘటన జరిగింది. కలెక్టరేట్లో తన సోదరితో కలిసి భర్త ఉన్నట్లు భార్య తెలుసుకున్నది. వెంటనే అక్కడికి వెళ్లింది. తన చెల్లితో కలిసి ఉన్న భర్తను నిలదీయడంతోపాటు అతడి చొక్కాపట్టుకుని చెంపలపై కొట్టింది.
కాగా, కలెక్టరేట్లో ఈ సంఘటన జరుగడంతో పోలీసులు వెంటనే స్పందించారు. భార్యాభర్తలకు సర్దిచెప్పేందుకు ఒక పోలీస్ అధికారి ప్రయత్నించారు. వారు మాట వినకపోవడంతో పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ప్రభుత్వ ప్రాంగణంలో శాంతికి విఘాతం కలిగించినందుకు ఆ భార్యాభర్తలను అరెస్ట్ చేశారు. రూ. 50,000 బాండ్‌పై వారిద్దరితో సంతకాలు తీసుకున్న తర్వాత షరతులు విధించడంతోపాటు వారిని హెచ్చరించి విడిచిపెట్టారు.
మరోవైపు ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో నెటిజన్లు భిన్నంగా స్పందించారు. భర్తను భార్య బహిరంగంగా కొట్టడాన్ని కొందరు తప్పుపట్టారు. మహిళా కమిషన్ మాదిరిగా మగవారికి కూడా పురుష కమిషన్ ఉండాలని మరికొందరు డిమాండ్ చేశారు.
पति साली के साथ लड़ा रहा था इश्क, बीवी ने सरेआम मारे थप्पड़!
राजस्थान के जोधपुर कलेक्ट्रेट परिसर में एक पति-पत्नी के बीच ऐसा हंगामा हुआ कि वहां मौजूद अधिकारी भी देखते रह गए। एक पत्नी ने सबके सामने अपने पति को ही पीट दिया। दोनों के बीच हाथापाई का ये वीडियो जमकर वायरल हो रहा है,… pic.twitter.com/5fz0Ronhst
— Niharika Times (@niharika_times) July 23, 2025
Also Read:
BSF Jawan Robs Jewellery Shop | టాయ్ గన్‌తో బెదిరించి.. జ్యువెలరీ షాపులో బీఎస్ఎస్ జవాన్ దోపిడీ
Detonators In Plastic Bag | బస్టాండ్‌లో కలకలం.. ప్లాస్టిక్ బ్యాగ్‌లో జెలటిన్ స్టిక్స్, డిటోనేటర్లు
Shinde Sena Leader Pulls Out Sword | పార్కింగ్ వివాదం.. కత్తులు దూసిన షిండే వర్గం శివసేన నేతలు