Kollywood | ఒకే ఫ్రేమ్‌లో విజయ్, రజినీకాంత్, కమల్ హాసన్.. మురిసిపోతున్న ఫ్యాన్స్
Kollywood | తమిళ సినీ పరిశ్రమలో ప్రస్తుతం ఒక ఫొటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. తమిళనాడు ముఖ్యమంత్రి, స్టార్ హీరో విజయ్, సూపర్ స్టార్ రజినీకాంత్, లోకనాయకుడు కమల్ హాసన్ ముగ్గురూ ఒకే ఫ్రేమ్‌లో కనిపించడంతో అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఈ ముగ్గురు దిగిన ఫొటో ప్రస్తుతం నెట్టింట చర్చనీయాంశంగా మారింది.
Kollywood | తమిళ సినీ పరిశ్రమలో ప్రస్తుతం ఒక ఫొటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. తమిళనాడు ముఖ్యమంత్రి, స్టార్ హీరో విజయ్, సూపర్ స్టార్ రజినీకాంత్, లోకనాయకుడు కమల్ హాసన్ ముగ్గురూ ఒకే ఫ్రేమ్‌లో కనిపించడంతో అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఈ ముగ్గురు దిగిన ఫొటో ప్రస్తుతం నెట్టింట చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ ఈ ముగ్గురు స్టార్ హీరోలు ఒకే చోట కలవడానికి కారణం ఏంటంటే.. ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ పెళ్లి రిసెప్షన్. ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్, కావ్య మారన్ వివాహం నవంబర్ 11, 2026న ఘనంగా జరిగింది. ఈ వివాహ వేడుకకు కుటుంబ సభ్యులు, సన్నిహితులు, సినీ ప్రముఖులు హాజరయ్యారు. అనంతరం నిర్వహించిన వెడ్డింగ్ రిసెప్షన్‌కు కూడా పలువురు ప్రముఖులు తరలివచ్చి నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ వేడుకలో సినీ, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులు సందడి చేయడంతో రిసెప్షన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అయితే ఈ వేడుకలో అందరి దృష్టిని ఆకర్షించిన విషయం మాత్రం తమిళ సినీ పరిశ్రమకు చెందిన ముగ్గురు దిగ్గజాలు ఒకే ఫ్రేమ్‌లో కనిపించడం.తమిళ సినిమా రంగంలో అత్యంత ప్రజాదరణ కలిగిన నటులు విజయ్, రజినీకాంత్, కమల్ హాసన్ ముగ్గురూ అనిరుధ్ పెళ్లి రిసెప్షన్లో కలుసుకున్నారు. వీరు కలిసి కనిపించిన ఫొటో బయటకు రావడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
విజయ్ ప్రస్తుతం తమిళనాడు ముఖ్యమంత్రిగా రాజకీయ బాధ్యతలు నిర్వహిస్తుండగా, రజినీకాంత్, కమల్ హాసన్ సినీ రంగంలో తమదైన ప్రత్యేక గుర్తింపును కొనసాగిస్తున్నారు. ఈ ముగ్గురూ ఒకే చోట కనిపించడం అభిమానులకు అరుదైన దృశ్యంగా మారింది. ముఖ్యంగా విజయ్ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆయన సినీ ప్రముఖులతో కలిసి కనిపించే సందర్భాలు అభిమానుల్లో ప్రత్యేక ఆసక్తిని కలిగిస్తున్నాయి. అలాంటిది రజినీకాంత్, కమల్ హాసన్‌లతో కలిసి ఒకే ఫ్రేమ్‌లో కనిపించడంతో ఈ ఫొటోకు మరింత ప్రాధాన్యత ఏర్పడింది. విజయ్, రజినీకాంత్, కమల్ హాసన్‌లను ఒకే ఫ్రేమ్‌లో చూసిన అభిమానులు సోషల్ మీడియాలో తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ముగ్గురు దిగ్గజాలు ఒకే వేదికపై కలవడం చాలా అరుదైన విషయమని, ఇలాంటి ఫొటోలు చూడటం తమకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తోందని కామెంట్లు చేస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kollywood | ఒకే ఫ్రేమ్‌లో విజయ్, రజినీకాంత్, కమల్ హాసన్.. మురిసిపోతున్న ఫ్యాన్స్
Promotions | జీపీ కార్యదర్శులకు ప్రమోషన్లు ఎప్పుడు?.. ఏడు నెలలైనా గ్రేడింగ్‌పై తేల్చని ప్రభుత్వం
Shadow CMO | ఆరో అంతస్తులో ఆయనదే హవా.. సచివాలయంలో సీఎంవోకు సమాంతరంగా షాడో వ్యవస్థ!
Ramayana | బాక్సాఫీస్ వద్ద రామాయణ విధ్వంసం.. రూ.1600 కోట్లకు పైగా వసూళ్లు, బుక్ మై షోలో సరికొత్త రికార్డు!
Aarogyasri | ఏడాదిగా జీతాల్లేవ్.. కుటుంబ పోషణ కోసం ర్యాపిడో డ్రైవర్లుగా మారిన ఆరోగ్యశ్రీ ఉద్యోగులు
ట్రెండింగ్ వార్తలు
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి

