బెంగళూరు: బస్టాండ్‌లోని టాయిలెట్ వద్ద ప్లాస్టిక్ బ్యాగ్‌లో పేలుడు పదార్థాలైన జెలటిన్ స్టిక్స్, డిటోనేటర్లు ఉన్నాయి. (Detonators In Plastic Bag) ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు, బాంబ్ స్క్వాడ్ సిబ్బంది వెంటనే అక్కడకు చేరుకున్నారు. దీంతో అక్కడ కలకలం రేకెత్తించింది. కర్ణాటక రాజధాని బెంగళూరులో ఈ సంఘటన జరిగింది. బుధవారం కలాసిపాల్యలోని బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ (బీఎంటీసీ) బస్టాండ్ టాయిలెట్ వద్ద ఒక వ్యక్తి ప్లాస్టిక్ బ్యాగ్ వదిలేశాడు. టాయిలెట్ సిబ్బంది ఇది చూశాడు. ఆ వ్యక్తి ఎంతకీ తిరిగి రాకపోడంతో అనుమానించాడు. పోలీసులకు సమాచారం ఇచ్చాడు.
Gelatin Sticks
కాగా, పోలీసులు, బాంబు నిర్వీర్యం బృందాలు వెంటనే అక్కడకు చేరుకున్నాయి. ఆ ప్లాస్టిక్ బ్యాగ్‌ను పరిశీలించారు. అందులో ఆరు జెలటిన్ స్టిక్స్, కొన్ని డిటోనేటర్లు ఉన్నాయి. పేలుడు పదార్థాలైన వీటిని చూసి వారు షాక్ అయ్యారు. వాటిని స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.
మరోవైపు జెలటిన్ స్టిక్స్, డిటోనేటర్లతో కూడిన ప్లాస్టిక్ బ్యాగ్‌ను అక్కడ వదిలేసిన వ్యక్తిని గుర్తించేందుకు సీసీటీవీ ఫుటేజ్‌ను పోలీసులు పరిశీలిస్తున్నారు. కాగా, బెంగళూరులోని బస్టాండ్‌లో జరిగిన ఈ సంఘటన భద్రతాపరంగా ఆందోళన రేకెత్తించింది.
Also Read:
Shinde Sena Leader Pulls Out Sword | పార్కింగ్ వివాదం.. కత్తులు దూసిన షిండే వర్గం శివసేన నేతలు
Watch: వర్షం నీటితో నిండిన ఢిల్లీ రోడ్లు, ఈత కొట్టిన వ్యక్తి.. బీజేపీపై ఆప్ విమర్శ