ముంబై: శివసేన నాయకులు రెచ్చిపోయారు. పార్కింగ్ వివాదం నేపథ్యంలో ఒక వ్యక్తిపై కత్తులు దూశారు. (Shinde Sena Leader Pulls Out Sword) గొడవలో ఆ వ్యక్తి గాయపడ్డాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఈ సంఘటన జరిగింది. థానేలోని సాగర్ నగర్ ప్రాంతంలో పార్కింగ్ అంశంపై వివాదం జరిగింది. ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండే వర్గానికి చెందిన శివసేన నేత ఆకాష్ భలేరావు, అతడి అనుచరుడు సూరజ్ హజారే రెచ్చిపోయారు. ఒక వ్యక్తిపై కత్తులు దూశారు. అతడ్ని కొట్టడంతోపాటు కత్తులతో బెదిరించారు. ఈ గొడవలో ఆ వ్యక్తి తలకు గాయమైంది.
కాగా, ఈ సంఘటనపై పోలీసులు స్పందించారు. శివసేన షిండే వర్గం నేత ఆకాష్ భలేరావు, అతడి అనుచరుడు సూరజ్ హజారేను అదుపులోకి తీసుకున్నారు. పోలీస్ స్టేషన్కు తరలించారు. వారిపై చట్టపర్యంగా చర్యలు చేపడతామని పోలీస్ అధికారి వెల్లడించారు. మరోవైపు ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
पार्किंग विवाद को लेकर शिंदे गुट शिवसेना शाखा-प्रमुख ने लहराई तलवार, मारपीट में पीड़ित को सिर पर लगी चोट. गाड़ी पार्किंग को लेकर विवाद था. आरोप है कि शिवसेना शाखा प्रमुख ने पीड़ित को पहले तलवार दिखाकर धमकाया फिर झगड़े के दौरान उसपर वार भी किया जिससे पीड़ित को सिर पर चोट आई है.… pic.twitter.com/F44zwuCtwm
— NDTV India (@ndtvindia) July 23, 2025
Also Read:
Fake embassy | నకిలీ రాయబార కార్యాలయం, ఫ్యాన్సీ దౌత్య కార్లు.. ఒక వ్యక్తి అరెస్ట్
Air India Crash | తప్పుడు మృతదేహాలు చేరాయి.. బ్రిటన్ కుటుంబాలు ఆరోపణ
Watch: వర్షం నీటితో నిండిన ఢిల్లీ రోడ్లు, ఈత కొట్టిన వ్యక్తి.. బీజేపీపై ఆప్ విమర్శ