ముంబై: ఒక తల్లి తన కుమార్తె అయిన చిన్నారితో కలిసి బయటకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నది. చెప్పులు వేసుకుంటున్న ఆమె చిన్నారిని షూ ర్యాక్‌పై కూర్చోబెట్టింది. అయితే దానిపైకి ఎక్కిన ఆ చిన్నారి అక్కడున్న కిటికీపై కూర్చొనేందుకు ప్రయత్నించింది. దీంతో అదుపుతప్పి 12 అంతస్తుల బిల్డింగ్ పైనుంచి కిందపడి మరణించింది. (Girl Falls From 12th Floor) మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఈ సంఘటన జరిగింది. జూలై 23న రాత్రి 8 గంటల సమయంలో నైగావ్‌లోని నవ్‌కర్ సిటీ ప్రాంతంలోని అపార్ట్మెంట్లో నివసిస్తున్న మహిళ తన నాలుగేళ్ల కుమార్తె అన్వికతో కలిసి ఇంటి నుంచి బయటకు వచ్చింది. ఆమె డోర్ లాక్ చేస్తుండగా ఆ చిన్నారి షూ ర్యాక్ వద్దకు వెళ్లింది. తల్లి చెప్పులు వేసుకునేందుకు ప్రయత్నించింది.
కాగా, ఆ మహిళ తన కుమార్తె అన్వికను వారించింది. ఆ బాలికను షూ ర్యాక్‌పై కూర్చోబెట్టింది. తన చెప్పులు వేసుకుని కుమార్తె చెప్పులు బయటకు తీసింది. ఇంతలో ఆ చిన్నారి షూ ర్యాక్‌పైకి ఎక్కింది. అక్కడ తెరిచి ఉన్న కిటికీపై కూర్చొనేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలో అదుపుతప్పి 12వ అంతస్తు నుంచి కిందపడిండి.
మరోవైపు ఇది చూసి షాకైన తల్లి సహాయం కోసం కేకలు వేసింది. దీంతో పొరుగువారు తమ ఇళ్ల నుంచి బయటకు వచ్చారు. కొందరు వ్యక్తులు ఆ చిన్నారి కోసం కిందకు పరుగులుతీశారు. బిల్డింగ్ 12వ అంతస్తు నుంచి కిందపడిన అన్విక తీవ్రంగా గాయపడింది. వెంటనే ప్రైవేట్ హాస్పిటల్‌కు తరలించగా అప్పటికే మరణించినట్లు డాక్టర్లు నిర్ధారించారు.
కాగా, ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆ బిల్డింగ్‌లోని సీసీటీవీలో రికార్డైన ఈ షాకింగ్ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
#INDIA: #Maharashtra: Tragic accident in #Vasai
Mother made her 4 year old daughter sit near the window… she lost her balance and fell from the 12th floor #died on the spot.
The entire incident was captured on CCTV, people were shocked after watching the video. pic.twitter.com/ele0fiv9En— CMNS_Media⚔️ #Citizen_Media🏹VEDA 👣 (@1SanatanSatya) July 25, 2025
Also Read:
Teen Kills Self | తల్లి మరణాన్ని తట్టుకోలేక.. కుమారుడు ఆత్మహత్య
Watch: వర్షాలకు తెగిన రోడ్డు.. మానవ వంతెన ద్వారా నీటిని దాటిన స్కూల్ విద్యార్థులు
Watch: తన చెల్లితో కలిసి ఉన్న భర్తను చూసిన భార్య.. తర్వాత ఏం జరిగిందంటే?