ముంబై: తల్లి మరణాన్ని కుమారుడు తట్టుకోలేకపోయాడు. తల్లి కలలో కనిపించడంతో ఆమె వద్దకు వెళ్లాలని నిర్ణయించాడు. ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. (Teen Kills Self) దిగులుగా ఉన్న తనను తల్లి తన వద్దకు పిలిచిందని సూసైడ్ నోట్లో పేర్కొన్నాడు. మహారాష్ట్రలోని సోలాపూర్‌లో ఈ సంఘటన జరిగింది. 16 ఏళ్ల శివశరణ్కు పదో తరగతిలో 92 శాతం మార్కులు వచ్చాయి. డాక్టర్ కావాలని భావించిన అతడు నీట్ పరీక్షకు ప్రిపేర్ అవుతున్నాడు.
కాగా, మూడు నెలల కిందట శివశరణ్ తల్లి కామెర్ల వ్యాధి వల్ల మరణించింది. నాటి నుంచి అతడు చాలా దిగులుగా ఉన్నాడు. అమ్మమ్మ ఇంట్లో ఉంటున్న ఆ యువకుడు శుక్రవారం ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తల్లి కలలో కనిపించిందని, దిగులుగా ఉన్న తనను ఆమె వద్దకు రమ్మని పిలువడంతో చనిపోతున్నట్లు సూసైడ్ నోట్లో పేర్కొన్నాడు. తనను చాలా ముద్దుగా చూసుకున్న అమ్మమ్మ, మేనమామకు కృతజ్ఞతలు తెలిపాడు. తన చెల్లిని సంతోషంగా ఉంచాలని కోరాడు.
మరోవైపు ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఆ ఇంటికి చేరుకున్నారు. శివశరణ్ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆ యువకుడు రాసిన సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ అధికారి వెల్లడించారు.
Also Read:
Watch: వర్షాలకు తెగిన రోడ్డు.. మానవ వంతెన ద్వారా నీటిని దాటిన స్కూల్ విద్యార్థులు
Watch: తన చెల్లితో కలిసి ఉన్న భర్తను చూసిన భార్య.. తర్వాత ఏం జరిగిందంటే?
BSF Jawan Robs Jewellery Shop | టాయ్ గన్‌తో బెదిరించి.. జ్యువెలరీ షాపులో బీఎస్ఎస్ జవాన్ దోపిడీ