IND vs ZIM : చావోరేవో పోరులో భారత జట్టు జూలు విదిల్చింది. టాపార్డర్ ఆకాశమే హద్దుగా చెలరేగి రికార్డు స్కోరందించగా.. జింబాబ్వేపై 72 పరుగులతో జయభేరి మోగించింది టీమిండియా. రికార్డు ఛేదనకు దిగిన ప్రత్యర్ధిని వందలోపే ఆలౌట్ చేస్తుందనకుంటే.. కనీసం వంద పరుగుల తేడాతో అయినా గెలవలేదు. అయితే.. తొలిపోరులో దక్షిణాఫ్రికా చేతితో కంగుతిన్న టీమిండియా ఈ విజయంతో సెమీస్ ఆశలు సజీవంగా ఉంచుకుంది. గ్రూప్ ఏ నుంచి సఫారీ జట్టు సెమీస్‌కు అర్హత సాధించింది.
లీగ్ దశను అజేయంగా ముగించి.. సూపర్ 8ను ఓటమితో ఆరంభించిన భారత్.. కీలకమ్యాచ్‌లో జింబాబ్వేను చిత్తు చేసింది. అహ్మదాబాద్‌లో దక్షిణాఫ్రికా చేతిలో 76 పరుగుల తేడాతో ఓడిన టీమిండియా.. చెపాక్‌లో ఆఫ్రికా జట్టుపై 72 పరుగుల తేడాతో గెలుపొందింది. అయితే.. వెస్టిండీస్‌పై 9 వికెట్లతో జయభేరి మోగించిన సఫారీ టీమ్.. గ్రూప్ ఏ నుంచి దర్జాగా సెమీస్‌లో అడుగుపెట్టింది. ఈ పరిస్థితుల్లో చివరి నాకౌట్ పోరు భారత్, కరీబియన్ జట్టుకు కీలకం కానుంది. గెలిచిన జట్టు ముందంజ వేస్తుంది. ఒకవేళ మ్యాచ్ రద్దైతే.. మెరుగైన రన్రేటున్న విండీస్ సెమీస్ బెర్తు పట్టేస్తుంది.
A comprehensive victory 🙌#TeamIndia clinch the #INDvZIM clash by 7️⃣2️⃣ runs courtesy of an all-round effort!
Scorecard ▶️ https://t.co/p4GxtxGkBf#T20WorldCup | #MenInBlue pic.twitter.com/Sk1dlTQ4FD
— BCCI (@BCCI) February 26, 2026
రికార్డు ఛేదనలో జింబాబ్వే ఇన్నింగ్స్‌ను ఓపెనర్లు బ్రియాన్ బెన్నెట్(97 నాటౌట్), మరుమని(20)లు దూకుడగా ఆరంభించారు. పవర్ ప్లేలో వీరిద్దరూ స్కోర్ 40 దాటించారు. అయితే.. అక్షర్ పటేల్ ఓవర్లో మరుమని షాట్ ఆడి ఇషాన్ చేతికి చిక్కాడు. కాసేపటికే డియన్ మైయర్స్(6)ను వరుణ్ చక్రవర్తి వెనక్కి పంపాడు.
అనంతరం కెప్టెన్ సికిందర్ రజా(31) జతగా బెన్నెట్ పెద్ద షాట్లు ఆడాడు. వీరిద్దరూ సిక్సర్లతో అలరిస్తూ అర్ధ శతకం భాగస్వామ్యం నెలకొల్పారు. రజాను అర్ష్‌దీప్ ఔట్ చేయగా.. మున్యోగా( 11), ముసెకివా(7)లు త్వరగానే పెవిలియన్ చేరారు. ఓవైపు వికెట్లు పడుతున్నా బెన్నెట్ మాత్రం తగ్గేదేలే అన్నట్టు చెలరేగి సెంచరీకి చేరువయ్యాడు. కానీ.. ఓవర్లో సిక్స్, ఫోర్ రావడంతో జింబాబ్వే 184కే పరిమితమైంది.
సెమీస్ ఆశలు నిలవాలటే గెలిచి తీరాల్సిన మ్యాచ్‌లో భారత క్రికెటర్లు శివాలెత్తిపోయారు. ఓపెనర్ అభిషేక్ శర్మ(55) ఫామ్ చాటుకుంటూ అర్ధశతకంతో రెచ్చిపోగా.. వచ్చినవాళ్లు వచ్చినట్టు వీరంగం సృష్టించారు. జింబాబ్వే బౌలర్లను హడలెత్తిస్తూ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్(33), తిలక్ వర్మ(44 నాటౌట్)లు కసిదీరా కొట్టగా.. హార్దిక్ పాండ్యా(50 నాటౌట్) తన స్టయిల్ విధ్వంసంతో ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు. టాపార్డర్ సహా మిడిల్ మెరుపులతో టీమిండియా పొట్టి ప్రపంచకప్‌లో 256తో వ్యక్తిగత రికార్డు(గతంలో 220 రన్స్)ను బ్రేక్ చేసింది.
Innings Break!
A collective batting effort takes #TeamIndia to their highest-ever total in #T20WorldCup history 💪
Over to the bowling unit now!
Scorecard ▶️ https://t.co/p4GxtxFMLH#MenInBlue | #INDvZIM pic.twitter.com/cFua2U93ke
— BCCI (@BCCI) February 26, 2026