లక్నో: వృద్ధురాలి పట్ల కుటుంబ సభ్యులు అమానుషంగా ప్రవర్తించారు. అర్ధరాత్రి వేళ ఆటోలో తీసుకెళ్లి ఒకచోట రోడ్డు పక్కన పడేసి వెళ్లిపోయారు. (elderly woman dumped roadside) వృద్ధురాలిని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆమెను హాస్పిటల్‌కు తరలించగా మరణించింది. ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో ఈ సంఘటన జరిగింది. బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఇద్దరు మహిళలు 80 ఏళ్లు పైబడిన వృద్ధురాలిని ఆటోలో తరలించారు. ఆటో డ్రైవర్ సహాయంతో కిషున్ దాస్పూర్ ప్రాంతంలోని రోడ్డు పక్కన ఆమెను పడేశారు. వృద్ధురాలిపై దుప్పటి కప్పి అక్కడి నుంచి వెళ్లిపోయారు.
కాగా, తెల్లవారుజామున కొందరు వ్యక్తులు ఆ వృద్ధురాలిని గమనించారు. ఆమెను వివరాలు అడిగారు. ఏమీ చెప్పలేకపోవడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడకు చేరుకున్న పోలీసులు ఆ వృద్ధురాలిని మెడికల్ కాలేజీ హాస్పిటల్‌కు తరలించారు. అయితే తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె చికిత్స పొందుతూ మరణించింది.
మరోవైపు ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్‌ను పోలీసులు పరిశీలించారు. ఆటోలో వచ్చిన ఇద్దరు మహిళలు ఆ వృద్ధురాలిని రోడ్డు పక్కన పడేసినట్లు గమనించారు. దీంతో చనిపోయిన ఆ వృద్ధురాలు ఎవరు, ఆమె కుటుంబ సభ్యులు ఎవరు అన్నది దర్యాప్తు చేస్తున్నారు.
కాగా, సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. అనారోగ్యంతో ఉన్న వృద్ధురాలిని దారుణంగా రోడ్డు పక్కన పడేసిన ఆమె కుటుంబ సభ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
जब यह वीडियो देखा, तो आंखों में आंसु और गुस्सा, दोनों एक साथ आए😭😡
परिवार के लोग, बोलने और चलने में असमर्थ अपने परिवार की एक बूढ़ी स्त्री को रात के अंधेरे में सड़क पर छोड़कर चले गए।
बुजुर्ग स्त्री कुछ भी बताने में असमर्थ है।
📍अयोध्या, UP pic.twitter.com/uRZjFGGY7X— 𝙼𝚛 𝚃𝚢𝚊𝚐𝚒 (@mktyaggi) July 24, 2025
Also Read:
Watch: చిన్నారిని షూ ర్యాక్‌పై కూర్చోబెట్టిన తల్లి.. తర్వాత ఏం జరిగిందంటే?
Man Kills Friend | సోషల్ మీడియాలో ప్రియురాలిని ఫాలో అవుతున్నందుకు.. ఫ్రెండ్‌ను హత్య చేసిన వ్యక్తి
Teen Kills Self | తల్లి మరణాన్ని తట్టుకోలేక.. కుమారుడు ఆత్మహత్య