లక్నో: ఆర్మీ జవాన్, ఒక మహిళ కొంతకాలంగా సహజీవనం చేస్తున్నారు. అయితే తాగి వచ్చి కొడుతున్న అతడ్ని వదిలించుకోవాలని ఆమె భావించింది. ఈ నేపథ్యంలో గొంతునొక్కి హత్య చేసింది. (Jawan Killed By Live-In Partner) కేసు దర్యాప్తు చేసిన పోలీసులు ఆ మహిళను అరెస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని బిజ్నోర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. నజీబాబాద్‌లోని ఆదర్శ్‌నగర్‌లో నివసిస్తున్న 32 ఏళ్ల అమిత్ సాగర్ ఆర్మీలో జవాన్‌గా పని చేస్తున్నాడు. గత మూడేళ్లుగా మమత అనే మహిళతో సహజీవనం చేస్తున్నాడు.
కాగా, జూలై 15న అమిత్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో ఆసుపత్రికి తరలించారు. అయితే అక్కడ అతడు మరణించాడు. గొంతునొక్కడం వల్ల ఊపిరాడక అమిత్ మరణించినట్లు పోస్ట్‌మార్టం పరీక్షలో తేలింది. ఈ నేపథ్యంలో సహజీవనం చేస్తున్న మమతపై అమిత్ తల్లి అనుమానం వ్యక్తం చేసింది. ఆమెపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.
మరోవైపు మమతను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. అమిత్ సాగర్ ఎప్పుడూ మద్యం సేవించి తనను కొడుతుంటాడని ఆమె ఆరోపించింది. అతడితో సంబంధాన్ని ముగించాలని, అతడి నుంచి విముక్తి పొందాలని భావించి హత్య చేసినట్లు చెప్పింది. దీంతో మమతను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ అధికారి వెల్లడించారు.
Also Read:
Watch: కదులుతున్న కారుపై మహిళ ‘ఆరా డ్యాన్స్’.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వృద్ధురాలి పట్ల అమానుషం.. రాత్రివేళ రోడ్డు పక్కన పడేయడంతో మృతి
Watch: వర్షాలకు తెగిన రోడ్డు.. మానవ వంతెన ద్వారా నీటిని దాటిన స్కూల్ విద్యార్థులు