లండన్: ఎలిజబెత్ కుమారుడు, ప్రిన్స్ ఛార్లెస్ సోదరుడు ఆండ్రూ మౌంట్‌బాటన్-విండ్సర్(Andrew Mountbatten)ను అరెస్టు చేశారు. పబ్లిక్ ఆఫీసును దుర్వినియోగం చేసిన కేసులో ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. లండన్‌కు చెందిన థామ్స్ వ్యాలీ పోలీసులు ఆండ్రూ మౌంట్‌బాటన్‌ను అరెస్టు చేశారు. అమెరికా ఫైనాన్షియర్, సెక్స్ అఫెండర్ జెఫ్రీ ఎప్స్టీన్కు 2010లో కొన్ని ట్రేడ్ రిపోర్ట్స్‌ను అందజేసినట్లు మౌంట్బాటన్పై ఆరోపణలు ఉన్నాయి.
కింగ్ ఛార్లెస్ సోదరుడు ప్రస్తుతం కస్టడీలో ఉన్నారని, బెర్క్‌షైర్.. నోర్ఫోక్లో ఉన్న ఆఫీసుల్లో సోదాలు చేస్తున్నామని పోలీసులు తమ స్టేట్మెంట్లో ప్రకటించారు. అత్యంత రహస్యమైన అంశాన్ని ఫైనాన్షియర్ జెఫ్రీ ఎప్స్టీన్కు మాజీ ప్రిన్స్ షేర్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయని, ఆ కేసులో మౌంట్‌బాటన్‌ను విచారిస్తున్నట్లు థేమ్స్ వాలీ పోలీసులు చెప్పారు. ఆండ్రూ ఇవాళ 66వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. అయితే తానేమీ తప్పు చేయలేదని ఆయన వెల్లడించారు.
మాజీ యువరాజు ఆండ్రూను కేవలం 96 గంటలు మాత్రమే అరెస్టు చేసే అవకాశం ఉన్నట్లు కొందరు నిపుణులు చెబుతున్నారు. కాని దీనికి మెజిస్ట్రేట్ పలుమార్లు పర్మిషన్లు ఇవ్వాల్సి ఉంటుంది. చాలా వరకు కేసుల్లో 12 నుంచి 24 గంటల్లో అనుమానితులను అదపులోకి తీసుకుంటారు. కస్టడీ సూట్లో ఆండ్రూను బంధిస్తారు. దాంట్లో ఓ బెడ్, టాయిలెట్ ఉంటాయి. పోలీసు ఇంటర్వ్యూ పూర్తి అయ్యే వరకు అక్కడే ఉంటారు. స్పెషల్ ట్రీట్మెంట్ ఏమీ ఉండదు.