Watch: కదులుతున్న కారుపై మహిళ ‘ఆరా డ్యాన్స్’.. తర్వాత ఏం జరిగిందంటే?
Aura Dance' On Mercedes | రీల్‌తో ఫేమస్ అయ్యేందుకు ఒక జంట ప్రయత్నించింది. ఒక వ్యక్తి లగ్జరీ కారు డ్రైవ్ చేయగా బానెట్‌పై నిల్చొన్న మహిళ ‘ఆరా డ్యాన్స్’ చేసింది. ఈ వీడియో వైరల్ కావడంతో పోలీసులు ఆ జంటను అరెస్ట్ చేశారు.
ముంబై: రీల్‌తో ఫేమస్ అయ్యేందుకు ఒక జంట ప్రయత్నించింది. ఒక వ్యక్తి లగ్జరీ కారు డ్రైవ్ చేయగా బానెట్‌పై నిల్చొన్న మహిళ ‘ఆరా డ్యాన్స్’ చేసింది. (Aura Dance On Mercedes) ఈ వీడియో వైరల్ కావడంతో పోలీసులు ఆ జంటను అరెస్ట్ చేశారు. మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఈ సంఘటన జరిగింది. నవీ ముంబైకు చెందిన నజ్మిన్ సుల్దే, అల్ఫేష్ షేక్ కలిసి వైరల్ వీడియో కోసం ప్రయత్నించారు. మెర్సిడెస్ కారును అల్ఫేష్ డ్రైవ్ చేశాడు. బానెట్‌పై ప్రమాదకరంగా నిల్చొన్న నజ్మిన్ కారు కదులుతుండగా ప్రాచుర్యం పొందిన ‘ఆరా ఫార్మింగ్’ డ్యాన్స్ చేసింది.
కాగా, ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో పోలీసులు స్పందించారు. ఆ జంటను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం, ప్రజా భద్రతకు ప్రమాదం కలిగించడం వంటి పలు సెక్షన్ల కింద వారిపై కేసు నమోదు చేశారు. ఆ తర్వాత షరతులతో వారిని విడిచిపెట్టారు.
మరోవైపు ఈ సంఘటన నేపథ్యంలో నజ్మిన్ సుల్దే, అల్ఫేష్ షేక్ బహిరంగంగా క్షమాపణలు చెప్పారు. వైరల్ స్టంట్ ద్వారా తాము తప్పు చేశామని అన్నారు. ఇందులో తనదే పూర్తిగా తప్పని నజ్మిన్ తెలిపింది.
ℕ𝔸𝕍𝕀 𝕄𝕌𝕄𝔹𝔸𝕀 | Navi Mumbai police arrested a young woman, Nazmin Sulde, and a man for performing a daring stunt on a moving Mercedes-Benz car. The duo’s “Aura Farmer” dance, captured on video, went viral on social media, prompting swift action. The police registered a… pic.twitter.com/FKZMUQZbpW
— ℝ𝕒𝕛 𝕄𝕒𝕛𝕚 (@Rajmajiofficial) July 24, 2025
Also Read:
Watch: వృద్ధురాలి పట్ల అమానుషం.. రాత్రివేళ రోడ్డు పక్కన పడేయడంతో మృతి
Watch: చిన్నారిని షూ ర్యాక్‌పై కూర్చోబెట్టిన తల్లి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వర్షాలకు తెగిన రోడ్డు.. మానవ వంతెన ద్వారా నీటిని దాటిన స్కూల్ విద్యార్థులు
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

