కారేపల్లి సంత గుడి ప్రాంగణంలో కనుల పండువగా వేంకటేశ్వర స్వామి కల్యాణం
ఖమ్మం జిల్లా సింగరేణి (కారేపల్లి) మండల కేంద్రంలో గల సంత గుడి ప్రాంగణంలో శ్రీ వేంకటేశ్వర స్వామివారి కల్యాణ మహోత్సవం సోమవారం అంగరంగ వైభవంగా జరిగింది. దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక వాతావరణంలో జరిగిన ఈ కల్యాణ క్రతువు..
కారేపల్లి, మార్చి 02 : ఖమ్మం జిల్లా సింగరేణి (కారేపల్లి) మండల కేంద్రంలో గల సంత గుడి ప్రాంగణంలో శ్రీ వేంకటేశ్వర స్వామివారి కల్యాణ మహోత్సవం సోమవారం అంగరంగ వైభవంగా జరిగింది. దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక వాతావరణంలో జరిగిన ఈ కల్యాణ క్రతువు భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. ఉదయం వేళ నుండే భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి స్వామివారి దర్శనం చేసుకున్నారు. వేద పండితులు వేద మంత్రోచ్చారణల నడుమ శాస్త్రోక్తంగా కల్యాణ కార్యక్రమం కనుల పండువగా నిర్వహించారు. స్వామివారికి ప్రత్యేక అలంకరణలు చేసి పుష్పాలతో కల్యాణ మండప ప్రాంగణాన్ని అందంగా ముస్తాబు చేశారు. తాళాలు, డోలు వాయిద్యాల శుభ నాదం మధ్య స్వామివారి కల్యాణం వైభవంగా కొనసాగింది. కల్యాణ సమయంలో అర్చకులు స్వామివారి దివ్య గుణాలను, కల్యాణ మహిమలను వివరించారు. కల్యాణానంతరం ఆలయ మండపం ప్రాంగణంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించి భక్తులకు ప్రసాదం పంపిణీ చేశారు. స్థానిక ప్రజలు, వ్యాపారులు, యువకులు, మహిళలు, వివిధ పార్టీల రాజకీయ నాయకులు, ప్రముఖులు ఈ కల్యాణ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొని సేవలందించారు.

కారేపల్లి సంత గుడి ప్రాంగణంలో కనుల పండువగా వేంకటేశ్వర స్వామి కల్యాణం

కారేపల్లి సంత గుడి ప్రాంగణంలో కనుల పండువగా వేంకటేశ్వర స్వామి కల్యాణం
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MLA Palla Rajeshwar Reddy | మోదీ,అమిత్ షాతో సీఈసీ కుమ్మక్కు : ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి
IND vs WI | టాస్ గెలిచిన వెస్టిండీస్.. ఆ 11 మందితోనే బరిలోకి టీమిండియా..!
‘పట్టభద్రులు ఓటు నమోదు చేసుకోవాలి’
MP Vaddiraju Ravichandra | ప్రధాన ఎన్నికల కమిషనర్ తక్షణమే తప్పుకోవాలి : ఎంపీ వద్ది రాజు రవిచంద్ర
JNU professor | జేఎన్‌యూలో లైంగిక వేధింపుల ఆరోపణలు.. ప్రొఫెసర్‌ను డిస్మిస్ చేసిన యూనివర్సిటీ
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

