Spirit | గ్లోబల్ స్టార్ యాక్టర్ ప్రభాస్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్లో పెట్టాడని తెలిసిందే. వీటిలో మోస్ట్ ఎవెయిటెడ్ క్రేజీ ప్రాజెక్ట్ స్పిరిట్. యానిమల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే మొదలైంది. కాగా ఈ చిత్రంలో విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ కీలక పాత్రలో నటిస్తున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే స్పిరిట్ షూటింగ్‌ను తాను ఇంకా మొదలుపెట్టలేదని క్లారిటీ కూడా ఇచ్చాడు ప్రకాశ్ రాజ్.
ఇదిలా ఉంటే మరోవైపు ఎవరూ ఊహించని విధంగా బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ లుక్‌ను షేర్ చేశారు. ఈ నేపథ్యంలో తాజా పుకారు ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. ఇంతకీ అదేంటనే కదా మీ డౌటు. మేకర్స్ ప్రకాశ్ రాజ్ పేరు ట్యాగ్ చేయకపోయే సరికి దాదాపు స్పిరిట్ నుంచి తప్పుకున్నట్టేనంటూ కొత్త వార్త తెరపైకి వచ్చింది. రాజకీయాలకు సంబంధించిన కామెంట్స్ చేయడం సినిమాపై ప్రభావం చూపించే అవకాశం ఉందని సందీప్ రెడ్డి వంగా ప్రకాశ్ రాజ్‌కు చెప్పాడట.
అయితే కామెంట్స్ చేయడం గురించి ప్రకాశ్ రాజ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి ఎలాంటి హామీనివ్వకపోవడంతో ఈ సినిమా నుంచి ప్రకాశ్ రాజ్ తప్పించి వివేక్ ఒబెరాయ్‌ను తీసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. కానీ ఈ వార్తలపై మేకర్స్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఈ మ్యాటర్‌పై మేకర్స్ మాత్రం సెలెన్స్ను మెయింటైన్ చేస్తున్నారు. మరి రానున్న రోజుల్లో ఈ న్యూస్‌పై ఏదైనా క్లారిటీ ఇస్తారేమో చూడాలి.
హై ఓల్టేజీ కాప్ డ్రామా నేపథ్యంలో రాబోతున్న ఈ చిత్రంలో యానిమల్ ఫేం తృప్తి డిమ్రి హీరోయిన్గా నటిస్తోంది. భద్రకాళి పిక్చర్స్, టీ సిరీస్‌తో కలిసి సంయుక్తంగా తెరకక్కిస్తున్న ఈ చిత్రానికి హర్షవర్ధన్ రాణే సంగీతం అందిస్తున్నాడు. స్పిరిట్‌లో పాపులర్ సౌత్ కొరియన్ యాక్టర్ (డాన్ లీ) మడాంగ్సియోక్ (MaDongSeok) విలన్‌గా నటిస్తున్నాడు.
Toxic | యష్ ‘టాక్సిక్’ నుంచి ఫస్ట్ సింగిల్ ‘తబాహి’ రిలీజ్.. ఆడియోతోనే అంచనాలు రెట్టింపు!