పంతాలకు పోవద్దు.. ఉద్యోగోన్నతులు కోల్పోవద్దు
పంతాలకు పోయి.. ఉద్యోగోన్నతులు కోల్పోవద్దని 1991, 1995, 1996 బ్యాచ్‌ల డీఎస్పీలకు డీజీపీ సీవీ ఆనంద్ సూచించారు. ఉద్యోగోన్నతుల విషయంలో నెలకొన్న సమస్యను పరిషరించేందుకు తాను చొరవ తీసుకుంటానని, అవసరమైతే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి శాశ్వత పరిషారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
- డీఎస్పీలకు డీజీపీ సూచన
హైదరాబాద్, సెప్టెంబర్ 15 (నమస్తే తెలంగాణ) : పంతాలకు పోయి.. ఉద్యోగోన్నతులు కోల్పోవద్దని 1991, 1995, 1996 బ్యాచ్‌ల డీఎస్పీలకు డీజీపీ సీవీ ఆనంద్ సూచించారు. ఉద్యోగోన్నతుల విషయంలో నెలకొన్న సమస్యను పరిషరించేందుకు తాను చొరవ తీసుకుంటానని, అవసరమైతే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి శాశ్వత పరిషారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఆయా బ్యాచ్‌లకు చెందిన డీఎస్పీలకు అదనపు ఎస్పీలుగా 37 మందికి ఉద్యోగోన్నతులు రావాల్సి ఉండగా కొందరు అధికారులు కోర్టులను ఆశ్రయించడంతో ఉద్యోగోన్నతుల ప్రక్రియ కొంతకాలంగా పెండింగ్‌లో ఉంది. దీంతో డీజీపీ చొరవ తీసుకుని ఆయా బ్యాచ్‌ల అధికారులతో సమావేశమయ్యారు.
కేసుల విషయంలో నిర్ణయం తీసుకునేందుకు వారం రోజుల సమయం ఇచ్చారు. కోర్టు కేసుల కారణంగా ఉద్యోగోన్నతుల ప్రక్రియకు ఆటంకం ఏర్పడుతున్నదని డీజీపీ వివరించారు. డీజీపీతో సమావేశం అనంతరం వరంగల్ జోన్‌కు చెందిన 1991, 1995, 1996 బ్యాచ్‌ల అధికారులు కోర్టులో దాఖలు చేసిన కేసులు ఉపసంహరించుకుంటున్నట్టు డీజీపీకి లేఖ అందించారు. హైదరాబాద్‌కు చెందిన 1991, 1995, 1996 బ్యాచ్‌ల అధికారులు కూడా కేసుల ఉపసంహరణకు సుముఖత వ్యక్తంచేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Caller ID | కాలర్ పేరు ప్రదర్శించడం తప్పనిసరి.. టెలికం కంపెనీలకు కేంద్రం ఆదేశం
Paper Leak | 8 ఏండ్లుగా పేపర్ లీక్‌లే లేవట.. NTAపై కేంద్ర విద్యా శాఖ నివేదిక
Reservations | మతం మారితే రిజర్వేషన్ వర్తించదు.. సుప్రీంకోర్టు కీలక తీర్పు
Non Veg | నాన్‌వెజ్ తినే మహిళలు వందేళ్లు బతుకుతారంట.. సర్వేలో ఆసక్తికర విషయాలు వెల్లడి
Farmers | పంటలు ఎండిపోతున్నా పట్టింపు లేదా.. అన్నదాతల ఆగ్రహం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

