లక్నో: వివాహితురాలైన మహిళకు మరో వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పడింది. దీంతో భర్త అడ్డుతొలగించుకునేందుకు వారిద్దరూ కలిసి కుట్రపన్నారు. ఈ నేపథ్యంలో భర్తకు రెండుసార్లు విషమిచ్చి భార్య హత్య చేసింది. (Wife Poisons Husband Twice) దర్యాప్తు చేసిన పోలీసులు ఆ మహిళ, ఆమె ప్రియుడ్ని అరెస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని ఫిరోజాబాద్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఉలావ్ గ్రామానికి చెందిన సునీల్ విషాహారం వల్ల మే 13న ఆసుపత్రి పాలయ్యాడు. ఆ మరునాడు కోలుకున్న అతడ్ని డిశ్చార్జ్ చేశారు.
కాగా, జూలైలో సునీల్‌పై మళ్లీ విష ప్రయోగం జరిగింది. దీంతో అతడు మరణించాడు. ఈ నేపథ్యంలో కోడలు, అదే గ్రామానికి చెందిన వ్యక్తి తన కొడుకుపై విష ప్రయోగం చేశారని సునీల్ తల్లి ఆరోపించింది. వారిద్దరి మధ్య వివాహేతర సంబంధం వల్ల తన కుమారుడికి విషం ఇచ్చి చంపారని పోలీసులకు ఫిర్యాదు చేసింది.
మరోవైపు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. విషం కలిపిన పెరుగు గిన్నె, మిగిలిన విషం బాటిల్ స్వాధీనం చేసుకున్నారు. సునీల్ భార్య ప్రియుడు పార్సిల్ ద్వారా విషం బాటిల్ తెప్పించినట్లు దర్యాప్తులో పోలీసులు తెలుసుకున్నారు. వారిద్దరి మధ్య వివాహేతర సంబంధం ఉన్నట్లు బయటపడింది. దీంతో సునీల్ భార్య, ఆమె ప్రియుడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసుపై మరింతగా దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ అధికారి వెల్లడించారు.
Also Read:
Jawan Killed By Live-In Partner | మూడేళ్లుగా సహజీవనం.. భాగస్వామి చేతిలో హత్యకు గురైన జవాన్
Shivakumar, Siddaramaiah aides clash | సిద్ధరామయ్య, డీకే శివకుమార్ సహాయకుల మధ్య.. ఢిల్లీలో ఘర్షణ