జైపూర్: కొత్తగా పెళ్లైన వ్యక్తిని విలాసవంతమైన కోరికలు తీర్చాలని భార్య బలవంతం చేసింది. దీంతో ఉద్యోగం మానేసిన అతడు చోరీల బాటపట్టాడు. (Newlywed man becomes thief) గోల్డ్ చైన్ దొంగతనం కేసు దర్యాప్తు చేసిన పోలీసులు చివరకు అతడ్ని అరెస్ట్ చేశారు. రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో ఈ సంఘటన జరిగింది. జామ్వరమ్గఢ్ గ్రామానికి చెందిన తరుణ్ పరీక్‌కు నెల రోజుల కిందట ఒక మహిళతో పెళ్లి జరిగింది. అయితే పెళ్లి తర్వాత భార్య ఖరీడైన డిమాండ్లు కోరింది. విలాసవంతమైన అవసరాలు తీర్చాలని అతడ్ని ఒత్తిడి చేసింది.
కాగా, బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (బీబీఏ) గ్రాడ్యుయేట్ అయిన తరుణ్ ఒక ప్రైవేట్ కంపెనీలో ఎగ్జిక్యూటివ్‌గా చేస్తున్నాడు. అయితే వచ్చే జీతంతో భార్య లగ్జరీ కోరికలు తీర్చలేక ఇబ్బందిపడ్డాడు. దీంతో ఉద్యోగం మానేసి నేరాల బాటపడ్డాడు. రోజూ తన గ్రామం నుంచి జైపూర్ చేరుకుని చోరీలు చేయసాగాడు.
మరోవైపు జైపూర్‌లోని ట్రాన్స్పోర్ట్ నగర్ ప్రాంతంలో పట్టపగలు వృద్ధురాలి మెడలోని గొలుసును ఒక వ్యక్తి తెంపుకుని పారిపోయాడు. స్థానికంగా కలకలం రేపిన ఈ చోరీపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలించారు. జైపూర్ నుంచి గ్రామానికి చేరుకున్న తరుణ్ కదలికలను గుర్తించారు. శుక్రవారం అతడ్ని అరెస్టు చేశారు.
కాగా, నెల రోజుల కిందట పెళ్లైన తరుణ్ తన భార్య లగ్జరీ కోరికలు తీర్చేందుకు నేరాలు చేస్తున్నట్లు పోలీసులు తెలుసుకున్నారు. ఇప్పటి వరకు అతడు ఎన్ని చోరీలు చేశాడు? ఎవరైనా సహచరులు ఉన్నారా? అని ప్రశ్నిస్తున్నారు. తరుణ్ నేరాల గురించి అతడి భార్యకు తెలుసా అని కూడా దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ అధికారి వెల్లడించారు.
Also Read:
Mumbai-Pune Expressway | ముంబై-పుణే ఎక్స్‌ప్రెస్‌వేపై భారీ ప్రమాదం.. 20 వాహనాలు ఢీ
child bites cobra snake to death | చేతికి చుట్టుకున్న నాగుపాము.. కొరికి చంపిన ఏడాది బాలుడు
child bites cobra snake to death | చేతికి చుట్టుకున్న నాగుపాము.. కొరికి చంపిన ఏడాది బాలుడు
Shivakumar, Siddaramaiah aides clash | సిద్ధరామయ్య, డీకే శివకుమార్ సహాయకుల మధ్య.. ఢిల్లీలో ఘర్షణ