జనగామ చౌరస్తా, మార్చి 11 : జనగామ కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా తీసుకున్న ఓ ని ర్ణయం వివాదాస్పదమైంది. ఇందిరా మహి ళాశక్తి పథకంలో కలెక్టరేట్‌కు సమీపంలో ఆరు నెలల క్రితం గత కలెక్టర్ షేక్ రిజ్వాన్‌బాషా ప్రారంభించిన వనిత టీస్టాల్తోపాటు విజయ డెయిరీ మిల్క్పార్లర్ను తొలగించాలని సందీ ప్ కుమార్‌ఝా ఆదేశాలిచ్చారు. బుధవారం మున్సిపల్ కమిషనర్, తహసీల్దార్, అర్బన్ సీఐ సిబ్బందితో కలిసి జేసీబీ, ట్రాక్టర్, క్రేన్ సాయంతో స్వయంఉపాధి కోసం డీఆర్డీఏ (సెర్ప్) ఆర్థిక సహాయంతో ఏర్పాటు చేసిన దళిత సామాజిక వర్గానికి చెందిన పాలమాకుల చిన్న మంజులకు సంబంధించిన వనిత టీ స్టాల్, పొత్కనూరి విజయలక్ష్మికి సంబంధించిన విజయ మిల్క్ పార్లర్‌కు అధికారులు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా తొలగించేయత్నం చేశారు.
షాప్‌లో ఉన్న విద్యుత్ కనెక్షన్ కట్ చేశారు. 3వ వార్డు కౌన్సిలర్ బూడిద అంజమ్మతో పాటు సీపీఎం నాయకులు బాధితులకు అండగా నిలబడి తొలగించకుండా అడ్డుకున్నారు. ఈ సందర్భంగా బాధితులు చిన్న మంజుల, విజయలక్ష్మి మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆర్థిక సహకారంతో ఏర్పాటు చేసిన టీ స్టాల్, మిల్క్ పార్లర్‌కు ప్రతి నెలా రూ.12,500, రూ.15వేల చొప్పు న ఈఎంఐ చెల్లిస్తున్నట్టు తెలిపారు. ఓ అధికారి బతుకుదెరువు చూపిస్తే, మరో అధికారి పేదల పొట్టగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. అదే సమయంలో కలెక్టర్‌ను కలిసేందుకు వచ్చిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సదరు మహిళల సమస్యను తెలుసుకొని ఇబ్బందులు పెట్టవద్దని కలెక్టర్ సందీప్ కుమార్ ఝాకు సూచించారు.