Ram Charan | రామ్ చరణ్ శస్త్రచికిత్స విజయవంతం.. త్వరలోనే ‘RC17’ సెట్స్‌లోకి!
Ram Charan | గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అభిమానులకు ఊరటనిచ్చే వార్త ఒకటి బయటకు వచ్చింది. కొంతకాలంగా కుడి చేతి మణికట్టు గాయంతో బాధపడుతున్న రామ్ చరణ్‌కు తమిళనాడులోని కోయంబత్తూరులో ఉన్న ప్రముఖ గంగా హాస్పిటల్లో విజయవంతంగా శస్త్రచికిత్స జరిగింది. ప్రపంచ ప్రఖ్యాత ఆర్థోపెడిక్, హ్యాండ్ సర్జన్ల బృందం ఆధ్వర్యంలో ఈ ఆపరేషన్ విజయవంతంగా పూర్తయినట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం చరణ్ ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉందని, ఆయన వేగంగా కోలుకుంటున్నారని వైద్యులు తెలిపారు.
Ram Charan | గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అభిమానులకు ఊరటనిచ్చే వార్త ఒకటి బయటకు వచ్చింది. కొంతకాలంగా కుడి చేతి మణికట్టు గాయంతో బాధపడుతున్న రామ్ చరణ్‌కు తమిళనాడులోని కోయంబత్తూరులో ఉన్న ప్రముఖ గంగా హాస్పిటల్లో విజయవంతంగా శస్త్రచికిత్స జరిగింది. ప్రపంచ ప్రఖ్యాత ఆర్థోపెడిక్, హ్యాండ్ సర్జన్ల బృందం ఆధ్వర్యంలో ఈ ఆపరేషన్ విజయవంతంగా పూర్తయినట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం చరణ్ ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉందని, ఆయన వేగంగా కోలుకుంటున్నారని వైద్యులు తెలిపారు. రామ్ చరణ్‌కు నిర్వహించిన ఈ శస్త్రచికిత్స కోసం అత్యంత అనుభవజ్ఞులైన వైద్య బృందాన్ని ఏర్పాటు చేశారు. గంగా హాస్పిటల్ చైర్మన్, ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ ఎస్. రాజశేఖరన్ ఈ ఆపరేషన్‌కు నాయకత్వం వహించారు.
గతంలో మెగాస్టార్ చిరంజీవికి క్లిష్టమైన వెన్నెముక శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించి ప్రశంసలు అందుకున్న ఆయన, మరోసారి మెగా కుటుంబానికి వైద్య సేవలు అందించారు. అంతేకాకుండా అమెరికాలోని మయామికి చెందిన ప్రపంచ ప్రఖ్యాత హ్యాండ్ అండ్ రిస్ట్ స్పెషలిస్ట్ డాక్టర్ అలెహాండ్రో బాడియాను ప్రత్యేకంగా కోయంబత్తూరుకు ఆహ్వానించారు. సాధారణంగా ఆయన అపాయింట్మెంట్ పొందడం కూడా చాలా కష్టమని చెప్పబడుతున్న తరుణంలో, స్వయంగా భారత్‌కు వచ్చి ఈ శస్త్రచికిత్సలో పాల్గొనడం విశేషంగా మారింది. డాక్టర్ ప్రవీణ్ భరద్వాజ్‌తో కలిసి ఈ నిపుణుల బృందం అత్యంత జాగ్రత్తగా ఆపరేషన్ పూర్తి చేసింది. సమాచారం ప్రకారం, రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’ సినిమా షూటింగ్ సమయంలోనే ఆయన కుడి చేతి మణికట్టుకు తీవ్ర గాయమైంది. ఆ సమయంలోనే వైద్యులు వెంటనే శస్త్రచికిత్స చేయించుకోవాలని సూచించినప్పటికీ, సినిమా చిత్రీకరణ, పోస్ట్ ప్రొడక్షన్ పనులు, ప్రచార కార్యక్రమాలకు అంతరాయం కలగకూడదనే ఉద్దేశంతో చరణ్ ఆ ఆపరేషన్‌ను వాయిదా వేసుకున్నారు.
గాయంతో నొప్పి ఉన్నప్పటికీ షూటింగ్‌ను పూర్తి చేయడంతో పాటు సినిమా ప్రమోషన్లలోనూ చురుగ్గా పాల్గొని తన అంకితభావాన్ని మరోసారి నిరూపించారు. ఇటీవల ‘పెద్ది’ ఘన విజయాన్ని నమోదు చేయడంతో, ఇక ఆలస్యం చేయకుండా వైద్యుల సలహా మేరకు శస్త్రచికిత్స చేయించుకున్నారు. వైద్యుల సూచన మేరకు రామ్ చరణ్ మరో నాలుగు రోజుల పాటు కోయంబత్తూరులోనే వైద్యుల పర్యవేక్షణలో విశ్రాంతి తీసుకోనున్నారు. అనంతరం హైదరాబాద్‌కు చేరుకుని మరికొన్ని వారాలు పూర్తి విశ్రాంతి తీసుకుంటారని సమాచారం. ఈ కాలంలో రెగ్యులర్ ఫిజియోథెరపీ, రిహాబిలిటేషన్ కార్యక్రమాల ద్వారా ఆయన పూర్తిగా కోలుకునేలా వైద్య బృందం ప్రత్యేక ప్రణాళిక రూపొందించినట్లు తెలుస్తోంది. పూర్తిగా కోలుకున్న తర్వాత రామ్ చరణ్ తన తదుపరి భారీ ప్రాజెక్ట్ ‘RC17’ షూటింగ్లో పాల్గొననున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- ram charan
- RC 17
- Success
- Surgery
RELATED ARTICLES
తాజా వార్తలు
Abhijeet Dipke | అభిజీత్ దీప్కే, నేహా బోరాను అరెస్ట్ చేసిన ఢిల్లీ పోలీసులు.. నిరసన ప్రదేశంలో కఠిన ఆంక్షలు
నాణ్యమైన, నిరంతరాయ విద్యుత్ సరఫరాయే లక్ష్యం : టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి
‘జూలూరుపాడును కరువు మండలంగా ప్రకటించాలి’
రైతులు యాసంగిలో వరి వేయొద్దు : దాసరి హరిచందన
మేడిగడ్డ దగ్గర బాంబ్ పేలిన శబ్దం వచ్చింది..! దీనిపై విచారణ జరపాలి : మాజీ ఈఎన్సీ మురళీధర్ రావు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

