ముంబై: వాహనాల రద్దీ ఎక్కువగా ఉండే ముంబై-పుణే ఎక్స్‌ప్రెస్‌వేపై పెద్ద ప్రమాదం జరిగింది. (Major Accident On Mumbai-Pune Expressway) 20 వాహనాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒకరు మరణించారు. సుమారు 16 మంది గాయపడ్డారు. మహారాష్ట్రలోని పూణే జిల్లాలో ఈ సంఘటన జరిగింది. శనివారం సాయంత్రం ముంబై-పుణే ఎక్స్‌ప్రెస్‌వేలోని సొరంగం ప్రవేశద్వారం వద్ద పెద్ద ప్రమాదం సంభవించింది. హైవేలోని లోనావాలా-ఖండాల ఘాట్ వద్ద కంటైనర్ వాహనం బ్రేకులు ఫెయిల్ అయ్యాయి. నియంత్రణ కోల్పోయిన ఆ కంటైనర్ ముందున్న ఒక వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. దీంతో మందున్న పలు వాహనాలు వరుసగా ఢీకొన్నాయి. పలు కార్లతో సహా సుమారు 20 వాహనాలు దెబ్బతిన్నాయి.
కాగా, ఈ భారీ ప్రమాదంలో ఒక వ్యక్తి మరణించగా సుమారు 16 మంది గాయపడ్డారు. వారిని వెంటనే అంబులెన్స్‌లలో ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ సంఘటన నేపథ్యంలో ఆ ఎక్స్‌ప్రెస్‌వే పలు గంటలపాటు వాహనాలు నిలిచిపోయాయి. 5 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
మరోవైపు పోలీసులు, ఎమర్జెన్సీ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. ధ్వంసమైన వాహనాలను రోడ్డు పక్కకు తొలగించారు. ట్రాఫిక్ జామ్‌ను క్లియర్ చేసేందుకు ట్రాఫిక్ పోలీసులు చాలా శ్రమించారు. వాహనాల రద్దీ తగ్గించడానికి ఇతర మార్గాల ద్వారా ట్రాఫిక్‌ను మళ్లించారు. కాగా, ముంబై-పుణే ఎక్స్‌ప్రెస్‌వేపై జరిగిన భారీ ప్రమాదానికి సంబంధించిన వీడియో క్లిప్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
Major accident on Pune-Mumbai Expressway; 20–25 vehicles damaged pic.twitter.com/2LsGCQtpHw
— Pune First (@Pune_First) July 26, 2025
Also Read:
child bites cobra snake to death | చేతికి చుట్టుకున్న నాగుపాము.. కొరికి చంపిన ఏడాది బాలుడు
Wife Poisons Husband Twice | వ్యక్తితో వివాహేతర సంబంధం.. భర్తకు రెండుసార్లు విషమిచ్చి చంపిన భార్య
Watch: చిన్నారిని షూ ర్యాక్‌పై కూర్చోబెట్టిన తల్లి.. తర్వాత ఏం జరిగిందంటే?