పాట్నా: ఏడాది వయస్సున బాలుడి చేతికి నాగుపాము చుట్టుకున్నది. ఈ నేపథ్యంలో నోటితో కొరికి ఆ పామును చంపాడు. (child bites cobra snake to death) ఆ తర్వాత అస్వస్థతకు గురైన ఆ బాలుడ్ని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బీహార్లోని పశ్చిమ చంపారన్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. బెట్టియా పరిధిలోని గ్రామానికి చెందిన ఒక మహిళ ఇంటి సమీపంలో కట్టెలు సేకరిస్తున్నది. ఆమె ఏడాది కుమారుడు గోవింద ఇంటి వద్ద ఆడుకుంటున్నాడు.
కాగా, నాగుపాము అక్కడకు వచ్చింది. ఆడుకుంటున్న బాలుడి చేతికి అది చుట్టుకున్నది. ఈ నేపథ్యంలో ఆ బుడతడు తన పళ్లతో గట్టిగా కొరకడంతో ఆ పాము చనిపోయింది. బాలుడి తల్లి, అమ్మమ్మ ఇది చూసి ఆందోళన చెందారు. ఆ తర్వాత కొద్దిసేపటికే గోవింద స్పృహ కోల్పోవడంతో తొలుత స్థానిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లారు. ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం బెట్టియాలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీ హాస్పిటల్కు తరలించారు.
ఆ చిన్నారి ఆరోగ్యం నిలకడగా ఉందని బాలుడు గోవిందకు చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. వైద్యుల పర్యవేక్షణలో ఆ బాలుడు ఉన్నట్లు వివరించారు. కాగా, ఏడాది వయస్సున్న గోవింద నోటితో కొరికి నాగుపామును చంపిన ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది. ఆ బాలుడికి సంబంధించిన వీడియో క్లిప్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
बेतिया में खेल- खेल में बच्चे ने जहरीले कोबरा को काटा, सांप की मौत !!
बिहार के बेतिया से एक चौंका देने वाली घटना सामने आई है, जहां एक साल के बच्चे ने खेल- खेल में एक सांप को पकड़ कर उसे काट लिया !!
उसके बाद परिजनों ने बच्चे को आनन- फानन में अस्पताल में भर्ती कराया, उधर, सांप की… pic.twitter.com/lwH5KkyoYw— MANOJ SHARMA LUCKNOW UP🇮🇳🇮🇳🇮🇳 (@ManojSh28986262) July 25, 2025
Also Read:
Watch: చిన్నారిని షూ ర్యాక్పై కూర్చోబెట్టిన తల్లి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వృద్ధురాలి పట్ల అమానుషం.. రాత్రివేళ రోడ్డు పక్కన పడేయడంతో మృతి
Watch: కదులుతున్న కారుపై మహిళ ‘ఆరా డ్యాన్స్’.. తర్వాత ఏం జరిగిందంటే?