హైదరాబాద్, మార్చి 11 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని ఉద్యాన రైతులకు అధునాతన శాస్త్రీయ సలహాలు, సూచనలు అందించేందుకు ఉద్యాన సాంకేతిక సమాచార కేంద్రాన్ని ఉద్యాన వర్సిటీలో త్వరలోనే ఏర్పాటుచేయనున్నట్టు వర్సిటీ వీసీ రాజిరెడ్డి వెల్లడించారు. ఈ మేరకు బుధవారం ఏర్పాట్ల ను పరిశీలించేందుకు ఉద్యాన వర్సిటీని ప్రముఖ వ్యవసాయరంగ నిపుణులు దిలీప్ సందర్శించారు. ఉద్యాన పంటల్లో మోడల్ డ్రోన్ వాడకం దేశానికే ఆదర్శంగా నిలువనున్నట్టు రాజిరెడ్డి చెప్పారు. ఉద్యానరంగంలో ఆవిషరణలు, అంకుర పరిశ్ర మల ఏర్పాటుకు ఊతమిచ్చేందుకు హార్టీ ఇన్నోవేషన్ సెంటర్ నెలకొల్పుతామని తెలిపారు.