ఖమ్మం రూరల్, ఆగస్టు 05 : ఖమ్మం రూరల్ మండలం గూడూరుపాడు గ్రామానికి చెందిన సిపిఐ నాయకుడు మారుతి నరేష్ బీఆర్ఎస్ పార్టీలో చేరారు. బుధవారం బీఆర్ఎస్ నేత, హర్షిని డెవలపర్స్ అధినేత అల్లిక వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ఆయన పార్టీలో చేరారు. ఈ సందర్భంగా అల్లిక వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. రాష్ట్రంలో రాబోయే ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వమే అన్నారు. అధికారంలో ఉన్న, లేకపోయినా నిరంతరం ప్రజల పక్షాన ఉండి ప్రజా సమస్యల కోసం పోరాటం చేస్తున్న పార్టీ కాబట్టి రాష్ట్రంలో బీఆర్ఎస్ కు ఇంత ఆదరణ ఉందన్నారు. బడుగు బలహీన వర్గాలకు గులాబీ జెండా ఎప్పటికీ అండగా ఉంటుందన్నారు.
రాబోయే రోజుల్లో పార్టీని గ్రామ మండల స్థాయిలో మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం పార్టీలో చేరిన నరేష్ మాట్లాడుతూ గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ పోరాట పటిమ తనను ఎంతగానో ఆకర్షించిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీకి రోజురోజుకు ఆదరణ పెరుగుతుందని, తన వంతు పార్టీ ఎదుగుదలకు కృషి చేస్తానని తెలిపారు. మరికొద్ది రోజుల్లోనే మరిన్ని కుటుంబాలు బీఆర్ఎస్ పార్టీలో చేరడం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ గ్రామ శాఖ బాధ్యులు, యువజన శాఖ బాధ్యులు పాల్గొన్నారు.