Vaddiraju Ravichandra | పోలీస్ స్టేషన్లోనే దాడికి దిగితే ఈ ప్రభుత్వం ఏం చేస్తోంది.. వద్దిరాజు రవిచంద్ర ఆగ్రహం
Vaddiraju Ravichandra | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పీఆర్వో మహేశ్, పీఏ మహేందర్ రెడ్డిపై పోలీస్ స్టేషన్లోనే దాడి ఘటనను ఎంపీ వద్దిరాజు రవిచంద్ర తీవ్రంగా ఖండించారు.
Vaddiraju Ravichandra | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పీఆర్వో మహేశ్, పీఏ మహేందర్ రెడ్డిపై పోలీస్ స్టేషన్లోనే దాడి ఘటనను ఎంపీ వద్దిరాజు రవిచంద్ర తీవ్రంగా ఖండించారు. విచారణ పేరుతో వారిని పండుగ రోజున సైఫాబాద్ పోలీస్ స్టేషన్‌కు పిలిపించి ముసుగులు ధరించిన 15 మంది పోలీసులు దాడికి యత్నించడం దుర్మార్గమైన చర్య అని మండిపడ్డారు. ఆ సమయంలో అక్కడే ఉన్న బీఆర్ఎస్ లీగల్ సెల్ బృందం ఈ దుశ్చర్యను కనిపెట్టి గట్టిగా అరవడంతో దుండగులు పారిపోయారని తెలిపారు.
పోలీస్ కస్టడీలో ఉన్న వారిపై పోలీస్ స్టేషన్లోనే దుండగులు వచ్చి దాడికి దిగితే ఈ ప్రభుత్వం ఏం చేస్తున్నదని వద్దిరాజు రవిచంద్ర నిలదీశారు. ఈ కేసులో తదుపరి ఆదేశాలు వెలువడే వరకు ఎలాంటి చర్యలు చేపట్టవద్దని హైకోర్టు ఆదేశించినప్పటికీ, ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోకుండా దాడికి దిగిందని మండిపడ్డారు. ఇది కోర్టు ధిక్కరణ కిందకే వస్తుందని ఆయన స్పష్టం చేశారు.
ఈ ఘటనపై హోం శాఖ బాధ్యతలు కూడా నిర్వర్తిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తక్షణమే స్పందించాలని డిమాండ్ చేశారు. దాడికి యత్నించిన వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prabhas Birthday | ప్రభాస్ బర్త్‌డే కానుక.. థియేటర్లలో సందడి చేయనున్న డార్లింగ్ బ్లాక్‌బస్టర్ మూవీస్ ‘వర్షం’, ‘ఛత్రపతి’!
Warangal | వరంగల్ భద్రకాళి ఆలయంలో భక్తుల రద్దీ.. ఏర్పాట్లలో విఫలమైన అధికార యంత్రాంగం
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
CJP | నిరసన గళాలకు కోర్టులో ఊరట.. విడుదలైన అభిజిత్ దీప్కే బృందం.. వీడియో..!
Dorothy | కార్తీక్ సుబ్బరాజ్ ‘డోరతి’ సినిమాపై రజినీకాంత్ ప్రశంసల జల్లు.. ‘నాకు కావలసిన కార్తీక్ ఇతనే’ అంటూ అభినందనలు!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

