Donald trump | హర్మూజ్‌ను తెరుస్తారా.. తీవ్ర దాడులను ఎదుర్కొంటారా..? ఇరాన్‌కు డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్
Donald trump | అమెరికా అధ్యక్షుడు (US President) ట్రంప్ (Donald Trump) ఇరాన్‌కు మరోసారి తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. హర్మూజ్ జలసంధి (Strait of Hormuz) ని సాధ్యమైనంత త్వరగా తెరవాలని, లేదంటే తీవ్రమైన దాడులు ఎదుర్కోవాల్సి ఉంటుందని వార్నింగ్ ఇచ్చారు. ఇరాన్‌తో తమ చర్చలు సానుకూలంగా సాగుతున్నా వాటిని ఆ దేశం బహిరంగంగా ఖండించడం ఆశ్చర్యకరంగా ఉందన్నారు.
Donald trump : అమెరికా అధ్యక్షుడు (US President) ట్రంప్ (Donald Trump) ఇరాన్‌కు మరోసారి తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. హర్మూజ్ జలసంధి (Strait of Hormuz) ని సాధ్యమైనంత త్వరగా తెరవాలని, లేదంటే తీవ్రమైన దాడులు ఎదుర్కోవాల్సి ఉంటుందని వార్నింగ్ ఇచ్చారు. ఇరాన్‌తో తమ చర్చలు సానుకూలంగా సాగుతున్నా వాటిని ఆ దేశం బహిరంగంగా ఖండించడం ఆశ్చర్యకరంగా ఉందన్నారు. ఈసారి చర్చల నుంచి వెనక్కి తగ్గితే పరిణామాలు అత్యంత తీవ్రంగా ఉంటాయని టెహ్రాన్ (Tehran) ను హెచ్చరించారు.
రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అతిపెద్ద దాడికి అమెరికా సిద్ధమవుతున్న సమయంలో ఇరాన్ తమను సంప్రదించి చర్చలకు రావాలని కోరిందని ట్రంప్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఇరాన్ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై మరో 48 గంటల్లో స్పష్టత వస్తుందని తెలిపారు. టెహ్రాన్ అణ్వాయుధాలు కలిగి ఉండేందుకు అమెరికా ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోదని అధ్యక్షుడు పునరుద్ఘాటించారు. హర్మూజ్ జలసంధిలో నౌకల స్వేచ్ఛాయుత రాకపోకలకు సంబంధించి ఇరాన్, ఒమన్‌తో కలిసి తాము చర్చలు జరుపుతున్నామని అగ్రరాజ్యం వెల్లడించింది.
దీనిపై ఒకట్రెండు రోజుల్లో ఒప్పందం కుదిరే అవకాశం ఉందని అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్ తెలిపారు. అయితే ఈ ప్రకటనను ఇరాన్ ఖండించింది. ఒమన్‌తో తాము జరుపుతున్న చర్చల్లో అమెరికా భాగస్వామ్యం ఏమాత్రం లేదని తెలిపింది. తమ సార్వభౌమాధికారాన్ని, భద్రతా ప్రయోజనాలను కాపాడే కొత్త సముద్ర రవాణా విధానాన్ని ఏర్పాటు చేయడంపైనే ఈ చర్చలు సాగుతున్నాయని పేర్కొంది. ఈ పరిణామాల నేపథ్యంలో ట్రంప్ తాజా హెచ్చరికలు చేయడం చర్చనీయాంశంగా మారింది. దీంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ఏ మలుపు తిరుగుతాయన్న దానిపై ఉత్కంఠ నెలకొంది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Akka Teaser | ‘అక్క’ టీజర్‌తో ఆసక్తి రేపుతున్న కీర్తి సురేశ్.. రాధికా ఆప్టేతో హోరాహోరీ పోరు!
418 Movie | ప్రశాంత్ నీల్ మూవీ సరికొత్త ప్రయోగం.. అర్ధరాత్రి ప్రీమియర్లతో ప్రేక్షకుల ముందుకు ‘418’!
Kolkata stampede | కోల్‌కతా దుర్గా మండపంలో తొక్కిసలాట.. 19 మంది మృతి.. 25 మందికి గాయాలు
Kolkata Stampede | కోల్‌కతా తొక్కిసలాట.. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల ఆర్థికసాయం, ప్రభుత్వ ఉద్యోగం..!
KTR | తెలంగాణ ఆడపడుచులకు కేటీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు.. అస్తిత్వ సౌరభమే బతుకమ్మ!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

