ఫారూక్ అబ్దుల్లాపై హత్యాయత్నం!
జమ్ముకశ్మీర్ మాజీ సీఎం, ఎన్సీ అధినేత ఫారూక్ అబ్దుల్లాపై హత్యాయత్నం జరిగింది. జమ్ములో ఓ వివాహానికి హాజరైన ఆయనపై ఒక వ్యక్తి బుధవారం కాల్పులకు పాల్పడ్డాడు.
జమ్ము, మార్చి 11: జమ్ముకశ్మీర్ మాజీ సీఎం, ఎన్సీ అధినేత ఫారూక్ అబ్దుల్లాపై హత్యాయత్నం జరిగింది. జమ్ములో ఓ వివాహానికి హాజరైన ఆయనపై ఒక వ్యక్తి బుధవారం కాల్పులకు పాల్పడ్డాడు. నిందితుడు తుపాకీని ఫారూక్‌కు గురిపెట్టినట్టు సీసీటీవీ ఫుటేజ్‌ల ద్వారా తెలుస్తున్నది. ఆ సమయంలో ఫారూక్ వెంట ఉప ముఖ్యమంత్రి సురేందర్ చౌదరి కూడా ఉన్నారు. కాల్పులకు పాల్పడిన వ్యక్తిని రక్షణ సిబ్బంది వెంటనే పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనలో చౌదరికి స్పల్ప గాయం కాగా, ఫారూక్ ఎలాంటి గాయాలు కాకుండా సురక్షితంగా తప్పించుకున్నారు. నిందితుడు జమ్ము నివాసి, గనుల వ్యాపారి కమల్ సింగ్ జన్వల్గా గుర్తించారు. నిందితుడు ఈ కాల్పులకు ఎందుకు పాల్పడిందీ వివరాలు తెలియరాలేదు. తన తండ్రిపై జరిగిన కాల్పులపై జమ్ము కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జడ్ ప్లస్, ఎన్ఎస్జీ రక్షణ ఉన్న ఒక మాజీ ముఖ్యమంత్రిపై ఇలా హత్యాయత్నానికి పాల్పడటం పలు సందేహాలను కలిగిస్తున్నదని అన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prabhas | ‘కల్కి 2’ సెట్స్‌లోకి రెబల్ స్టార్ ప్రభాస్.. త్వరలో ప్రారంభం కానున్న భారీ షెడ్యూల్!
రైతుల వ్యథలు పట్టించుకోని ప్రభుత్వం : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
‘రేషన్ షాపుల ద్వారా 14 రకాల నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలి’
Ramayana | రాష్ట్రపతి భవన్లో ‘రామాయణ’ స్పెషల్ స్క్రీనింగ్!
బూర్గంపహాడ్‌లో ఇసుక అక్రమ రవాణాపై టాస్క్‌ఫోర్స్ దాడులు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

