ముంబై: రేవ్ పార్టీపై పోలీసులు రైడ్ చేశారు. (Rave Party Raid) మాజీ మంత్రి అల్లుడుతో పాటు పలువురిని అరెస్ట్ చేశారు. డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. అయితే దీని వెనుక రాజకీయ దురుద్దేశం ఉన్నదా? అన్నది దర్యాప్తు చేయాలని ఆ మాజీ మంత్రి డిమాండ్ చేశారు. మహారాష్ట్రలోని పూణేలో ఈ సంఘటన జరిగింది. ఖరడి ప్రాంతంలోని స్టూడియో అపార్ట్మెంట్లో రేవ్ పార్టీ జరుగుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో క్రైమ్ బ్రాంచ్ పోలీసులు రైడ్ చేశారు. మద్యం, గంజాయి, హుక్కా వంటి మాదకద్రవ్యాల పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు మహిళలు, ఐదుగురు పురుషులతో సహా ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు.
కాగా, మహారాష్ట్ర మాజీ మంత్రి, ఎన్సీపీ (ఎస్పీ) సీనియర్ నేత ఏక్నాథ్ ఖడ్సే అల్లుడు ప్రాంజల్ ఖేవాల్కర్ కూడా రేవ్ పార్టీలో అరెస్టైన వారిలో ఉన్నారు. ఏక్నాథ్ ఖడ్సే కుమార్తె రోహిణి ఖడ్సే ప్రతిపక్ష ఎన్సీపీ (ఎస్పీ) మహిళా విభాగానికి రాష్ట్ర అధ్యక్షురాలు. ఈ నేపథ్యంలో పోలీసుల రైడ్ రాజకీయంగా కలకలం రేపింది. పోలీస్ చర్య వెనుక రాజకీయ ఉద్దేశం ఉన్నదా? అన్నది దర్యాప్తు చేయాలని మాజీ మంత్రి ఏక్నాథ్ ఖడ్సే డిమాండ్ చేశారు. అయితే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడే వారికి ఈ దాడి ఒక సందేశమని శివసేన (యూబీటీ) ఉప నాయకురాలు సుష్మా అంధారే విమర్శించారు.
Also Read:
child bites cobra snake to death | చేతికి చుట్టుకున్న నాగుపాము.. కొరికి చంపిన ఏడాది బాలుడు
Watch: వృద్ధురాలి పట్ల అమానుషం.. రాత్రివేళ రోడ్డు పక్కన పడేయడంతో మృతి
Watch: చిన్నారిని షూ ర్యాక్పై కూర్చోబెట్టిన తల్లి.. తర్వాత ఏం జరిగిందంటే?
Newlywed man becomes thief | భార్య విలాస కోరికలు తీర్చేందుకు.. దొంగగా మారిన కొత్తగా పెళ్లైన వ్యక్తి