ముంబై: మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) చీఫ్ రాజ్ ఠాక్రే 13 ఏళ్ల తర్వాత ఆదివారం తొలిసారి ముంబైలోని మాతోశ్రీలోకి అడుగుపెట్టారు. (Raj Thackeray Enters Matoshree) శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రేకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. సోదరులైన ఉద్ధవ్ ఠాక్రే, రాజ్ ఠాక్రేలు బాలాసాహెబ్ చిత్రం ముందు ఫొటో దిగారు. ‘నా అన్నయ్య శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే పుట్టినరోజు సందర్భంగా, దివంగత గౌరవనీయ బాలాసాహెబ్ ఠాక్రే నివాసం అయిన మాతోశ్రీని సందర్శించా. నా శుభాకాంక్షలు తెలియజేశా’ అని ఎక్స్‌లో పేర్కొన్నారు. ఎంఎస్ఎస్ నేతలు బాలా నందగావ్కర్, నితిన్ సర్దేశాయ్ కూడా రాజ్ ఠాక్రే వెంట ఉన్నారు.
కాగా, రాజకీయ విభేదాల కారణంగా 2006లో మాతోశ్రీని రాజ్ ఠాక్రే వీడారు. ఆ తర్వాత మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) పార్టీని ఏర్పాటు చేశారు. 2012లో బాలాసాహెబ్ ఠాక్రే మరణించినప్పుడు చివరిసారి మాతోశ్రీకి ఆయన వచ్చారు. 13 ఏళ్ల తర్వాత తొలిసారి మాతోశ్రీని ఆయన సందర్శించారు.
మరోవైపు మహారాష్ట్రలోని ప్రాథమిక స్కూళ్లలో తప్పనిసరిగా హిందీ భాషను అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించడం వివాదానికి దారి తీసింది. ఈ నేపథ్యంలో మరాఠీ గుర్తింపు కోసం పోరాటంలో భాగంగా ఉద్ధవ్, రాజ్ ఠాక్రేలు రెండు దశాబ్దాల తర్వాత తొలిసారి ఒకే రాజకీయ వేదికపైకి వచ్చారు. వర్లిలో జరిగిన విజయోత్సవ ర్యాలీలో కలిసి ప్రసంగించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని వారిద్దరూ నిర్ణయించారు.
Also Read:
Rave Party Raid | రేవ్ పార్టీపై పోలీసులు రైడ్.. మాజీ మంత్రి అల్లుడుతో పాటు పలువురు అరెస్ట్
child bites cobra snake to death | చేతికి చుట్టుకున్న నాగుపాము.. కొరికి చంపిన ఏడాది బాలుడు