లక్నో: విధుల్లో చేరిన తొలిరోజే ఐఏఎస్ అధికారి పరిశుభ్రతపై దృష్టిసారించారు. బహిరంగంగా మూత్ర విసర్జన చేసిన వారితోపాటు మరికొందరిని ఆయన గుంజీలు తీయించారు. అయితే ప్రభుత్వ కార్యాలయం అపరిశుభ్రంగా ఉండటాన్ని న్యాయవాదులు నిలదీశారు. ఈ నేపథ్యంలో ఆ ట్రైనీ ఐఏఎస్ అధికారి అందరి ముందు గుంజీలు తీశారు. (IAS Officer Does Sit-Ups) ఉత్తరప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. పోవాయన్ తహసీల్‌కు కొత్త సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ (ఎస్డీఎం)గా ట్రైనీ ఐఏఎస్ అధికారి రింకూ సింగ్ నియమితులయ్యారు. మంగళవారం తొలిసారి విధులు నిర్వహించేందుకు కార్యాలయానికి చేరుకున్నారు. ఆ పట్టణంలో తిరిగి పరిశుభ్రతను ఆయన పరిశీలించారు.
కాగా, పబ్లిక్ టాయిలెట్స్ పక్కన కొందరు వ్యక్తులు బహిరంగంగా మూత్ర విసర్జన చేయడాన్ని ఐఏఎస్ అధికారి రింకూ సింగ్ చూశారు. ఈ నేపథ్యథ్యంలో కొందరితో గుంజీలు తీయించారు. అయితే తాను బ్రాహ్మణుడని, మురికిగా ఉన్న పబ్లిక్ టాయిలెట్లోకి వెళ్లలేదని ఒక న్యాయవాది చెప్పాడు. అలాగే తల్లిదండ్రులు తమ పిల్లలతో కలిసి తిరుగుతుండటాన్ని రింకూ సింగ్ గమనించారు. పిల్లలను స్కూల్‌కు పంపనందుకు ఆ పేరెంట్స్‌తో కూడా గుంజీలు తీయించారు.
మరోవైపు నిరసన చేపట్టిన న్యాయవాదులను రింకూ సింగ్ కలిశారు. అయితే ఆయనతో మాట్లాడేందుకు న్యాయవాదులు నిరాకరించారు. జనంతో గుంజీలు తీయించడాన్ని నిలదీశారు. తహసీల్ కార్యాలయం, అక్కడి టాయిలెట్లు అపరిశుభ్రంగా ఉండటాన్ని న్యాయవాదులు ప్రశ్నించారు. దీంతో అధికారుల తప్పుగా భావించిన రింకూ సింగ్ అందరి ముందు గుంజీలు తీశారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
In UP’s Shahjahanpur, IAS officer Rinku Singh was made to do sit-ups by protesting lawyers on his first day of posting as SDM. The lawyers were upset because he raised concerns about the dirty and unhygienic condition of the tehsil premises | Watch#IASRinkuSinghRahi pic.twitter.com/zY8vaE6qUi
— The Tatva (@thetatvaindia) July 30, 2025
Also Read:
Poorest Man In Madhya Pradesh | మధ్యప్రదేశ్‌లో మరో పేద వ్యక్తి.. ఆదాయం సున్నా
Watch: స్కూటర్‌ను ఢీకొట్టిన వాహనం.. ఆపై రివర్స్‌లో వచ్చి వృద్ధుడ్ని ఢీ
child bites cobra snake to death | చేతికి చుట్టుకున్న నాగుపాము.. కొరికి చంపిన ఏడాది బాలుడు