Terrorists : జమ్మూకశ్మీర్ (Jammu and Kashmir) లోని కిస్ట్‌వార్ జిల్లా (Kishtwar district) లో భద్రతాబలగాల (Security forces) కు, ఉగ్రవాదుల (Terrorists) కు మధ్య భారీ ఎన్కౌంటర్ (Encounter) జరిగింది. ఈ ఎన్కౌంటర్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఆ ఉగ్రవాదులు పాకిస్థాన్‌కు చెందిన జైష్ ఎ మహమ్మద్ (JeM) కోసం పనిచేస్తున్నారని భద్రతాబలగాలు గుర్తించాయి.
మంచుతో నిండిన ఛత్రూ అడవుల్లో ఓ కొండ దిగువన గల మట్టి ఇంట్లో ఉగ్రవాదులు దాగి ఉన్నారన్న కచ్చితమైన సమాచారం అందుకున్న భద్రతాబలగాలు.. ప్రత్యేక ఆపరేషన్ చేపట్టి ఆ స్థావరాన్ని చుట్టుముట్టాయి. భద్రతాబలగాలు లొంగిపోవాలని హెచ్చరించగా.. తొలుత ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. దాంతో భద్రతాబలగాలు ఎదురుకాల్పులు జరిపాయి.
ఈ కాల్పుల్లో ఆ ఇంట్లో దాగి ఉన్న ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. మృతి చెందిన ఉగ్రవాదుల్లో కరుడుగట్టిన ఉగ్రవాది, జేఈఎం కమాండర్ సైఫుల్లా కూడా ఉన్నట్టు అనుమానిస్తున్నారు.