నగల్లోనూ మిక్స్ అండ్ మ్యాచ్
ఒకప్పుడు బంగారు నగలు ధరించాలంటే బంగారమే... వెండి నగలు పెట్టుకోవాలంటే వెండే. ఒకే లోహానికి చెందిన ఆభరణాలను మాత్రమే ధరించడం ఫ్యాషన్ నియమంగా ఉండేది. కానీ, ఇప్పుడు అవన్నీ మారిపోతున్నాయి.
ఒకప్పుడు బంగారు నగలు ధరించాలంటే బంగారమే… వెండి నగలు పెట్టుకోవాలంటే వెండే. ఒకే లోహానికి చెందిన ఆభరణాలను మాత్రమే ధరించడం ఫ్యాషన్ నియమంగా ఉండేది. కానీ, ఇప్పుడు అవన్నీ మారిపోతున్నాయి. ప్రపంచ ఫ్యాషన్ రంగంలో ‘మిక్స్ అండ్ మ్యాచ్ జ్యువెలరీ’ కొత్త ట్రెండ్‌గా నిలుస్తున్నది. అంటే బంగారం, వెండి, ముత్యాలు, రంగురంగుల రాళ్లు, ఆధునిక లోహాలతో చేసిన ఆభరణాలను ఒకేసారి సమతూకంలో ధరించడం.
ఇటీవల పారిస్, మిలాన్, న్యూయార్క్ ఫ్యాషన్ ప్రదర్శనల్లోనూ ఈ ధోరణి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఒక చేతికి బంగారు గాజులు, మరోవైపు వెండి కడియం, మెడలో ముత్యాల దండతో పాటు సన్నని బంగారు గొలుసు… ఇలాంటి కలయికలు ఇప్పుడు ఆధునిక శైలికి కొత్త నిర్వచనంగా మారాయి. ఒకే రకమైన నగలు ధరించడం కంటే, వ్యక్తిగత అభిరుచిని ప్రతిబింబించే కలయికలకే రూపకర్తలు ప్రాధాన్యం ఇస్తున్నారు.
ఈ ట్రెండ్ వెనుక మరో ఆసక్తికరమైన ఆలోచన ఉంది. ఇంట్లో ఉన్న నగలను సందర్భానికి తగ్గట్టుగా కొత్తగా మలచుకోవడం. అమ్మమ్మ కాలం నాటి ముత్యాల హారాన్ని ఆధునిక గొలుసుతో జత చేయడం, వెండి చెవిపోగులకు బంగారు ఉంగరాలను కలపడం, సంప్రదాయ నగలను పాశ్చాత్య దుస్తులతో ధరించడం… ఇవన్నీ ఇప్పుడు ప్రపంచ ఫ్యాషన్‌లో భాగమయ్యాయి.
ముఖ్యంగా భారతీయ మహిళలకు ఈ ట్రెండ్ మరింత అనుకూలం. పెళ్లిళ్లు, పండుగలప్పుడే కాదు… సాధారణ చీర, కుర్తా, లినెన్ దుస్తులతో కూడా ఇలాంటి నగల కలయిక ప్రత్యేకంగా కనిపిస్తుంది. అయితే ఫ్యాషనిస్టులు ఒక సూచన చేస్తున్నారు. అన్ని ఆభరణాలను ఒకేసారి ధరించకుండా, ఒకే ఆకర్షణీయమైన రకాన్ని కేంద్రంగా పెట్టుకుని మిగిలిన వాటిని సమతూకంగా ఎంచుకుంటే అందం మరింత పెరుగుతుంది.
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pakistan | పాకిస్తాన్, ఖైబర్ పఖ్తుంఖ్వాలో ఎమర్జెన్సీ.. పీటీఐ ప్రభుత్వం రద్దు.. సీఎం అరెస్ట్
Agriculture Admissions | వ్యవసాయ కోర్సుల్లో మిగిలిన సీట్లకు కౌన్సెలింగ్.. ఈ నెల 14 నుంచి ప్రారంభం
Kadapa DSP | కడప డీఎస్పీగా భవానీ భాధ్యతల స్వీకరణ
MLC Dasoju Shravan Kumar | ఈ ప్రభుత్వానికి ఎంప్లాయింట్ పాలసీనే లేదు : ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్
IndiGo Flight | ప్రయాణికుడి పవర్ బ్యాంకువల్ల ఇండిగో ఫ్లైట్‌లో మంటలు.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

