Health Insurance | 24 గంటలు దవాఖానలో ఉండలేదని బీమా క్లెయిమ్ తిరసరించలేరు.. కర్ణాటక హైకోర్టు కీలక తీర్పు
హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ పరిధిలో ఉన్న వ్యాధికి కొనసాగింపుగా అందించే చికిత్సకు 24 గంటల హాస్పిటల్ అడ్మిషన్ లేదన్న కారణంతో బీమా క్లెయిమ్‌ను తిరసరించ లేరని కర్ణాటక హైకోర్టు స్పష్టం చేసింది. దవాఖానలో అడ్మిట్ కావడం చికిత్స అందించే విధానాల్లో ఒకటేనని, చికిత్స స్వభావం, అది పాలసీలో కవర్ చేసిన వ్యాధికి సంబంధించినదా, వైద్యపరంగా అవసరమైనదా, పాలసీలో స్పష్టమైన మినహాయింపు ఉందా అనే అంశాలను పరిశీలించాల్సి ఉంటుందని జస్టిస్ సూరజ్ గోవిందరాజ్ పేరొన్నారు.
- క్యాన్సర్ చికిత్సలో ఇంజెక్షన్లకూ బీమా వర్తింపు
- కర్ణాటక హైకోర్టు కీలక తీర్పు
హైదరాబాద్, సెప్టెంబర్ 16 (నమస్తే తెలంగాణ): హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ పరిధిలో ఉన్న వ్యాధికి కొనసాగింపుగా అందించే చికిత్సకు 24 గంటల హాస్పిటల్ అడ్మిషన్ లేదన్న కారణంతో బీమా క్లెయిమ్‌ను తిరసరించ లేరని కర్ణాటక హైకోర్టు స్పష్టం చేసింది. దవాఖానలో అడ్మిట్ కావడం చికిత్స అందించే విధానాల్లో ఒకటేనని, చికిత్స స్వభావం, అది పాలసీలో కవర్ చేసిన వ్యాధికి సంబంధించినదా, వైద్యపరంగా అవసరమైనదా, పాలసీలో స్పష్టమైన మినహాయింపు ఉందా అనే అంశాలను పరిశీలించాల్సి ఉంటుందని జస్టిస్ సూరజ్ గోవిందరాజ్ పేరొన్నారు. అయితే ఈ తీర్పుతో ప్రతి ఓపీ చికిత్సకు ఆటోమేటిక్‌గా హెల్త్ ఇన్సూరెన్స్ వర్తిస్తుందని భావించ రాదని కోర్టు స్పష్టం చేసింది.
ఈ కేసులో స్టేజ్-4 ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న పద్మనాభ శెట్టి, డాక్టర్ల సూచన మేరకు తీసుకున్న జోలాడెక్స్, ఎక్స్జ్వా ఇంజెక్షన్ల కోసం రూ.2,85,470 ఖర్చు చేశారు. ఇతర క్యాన్సర్ చికిత్సల ఖర్చులను నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ చెల్లించినప్పటికీ, ఈ రెండు ఇంజెక్షన్ల ఖర్చును మాత్రం తిరసరించింది. పద్మనాభ శెట్టి దాఖలు చేసిన ఫిర్యాదుపై మంగళూరు పర్మనెంట్ లోక్ అదాలత్ రూ.2,85,470ను 6 శాతం వడ్డీతోపాటు రూ.25,000 పరిహారంగా చెల్లించాలని ఇచ్చిన ఆదేశాలను సమర్థించింది. నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ రిట్ పిటిషన్‌ను కొట్టివేసి, రూ.2,85,470ను తాజా వడ్డీతో పాటు అదనంగా రూ.50,000 ఖర్చులను 30 రోజుల్లో పద్మనాభ శెట్టికి చెల్లించాలని ఆదేశించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kolkata Stampede | ‘తొక్కిసలాట ఎలా జరిగింది’.. బాధితులను పరామర్శించిన కేంద్ర హోంమంత్రి, బెంగాల్ సీఎం.. Video
The Paradise | ఓటీటీలోకి ‘ది ప్యారడైజ్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Kolkata stampede | తొక్కిసలాట ఘటనపై రాష్ట్రపతి, ప్రధాని సంతాపం.. రూ.2 లక్షల పరిహారం ప్రకటించిన ప్రధాని
Akka Teaser | ‘అక్క’ టీజర్‌తో ఆసక్తి రేపుతున్న కీర్తి సురేశ్.. రాధికా ఆప్టేతో హోరాహోరీ పోరు!
418 Movie | ప్రశాంత్ నీల్ మూవీ సరికొత్త ప్రయోగం.. అర్ధరాత్రి ప్రీమియర్లతో ప్రేక్షకుల ముందుకు ‘418’!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

