వెన్నెల వెలుగుల్లో!
చీకట్లను దూరం చేసి వెలుగులు పంచే పౌర్ణమి కోసం అందరూ ఎదురుచూస్తుంటారు. ఆరుబయట కుర్చీ వేసుకొని నిండైన చందమామను ఎంతసేపు చూసినా తనివితీరదు. వెన్నెల వెలుగులు అలాంటివి మరీ. మనిషి మనసు దోసేసి, హాయినిచ్చే ఆ వెలుగులను మరింత వినూత్నంగా ఆస్వాదించాలంటే ఈ కింది ప్రదేశాలకు తప్పకుండా వెళ్లాల్సిందే.
చీకట్లను దూరం చేసి వెలుగులు పంచే పౌర్ణమి కోసం అందరూ ఎదురుచూస్తుంటారు. ఆరుబయట కుర్చీ వేసుకొని నిండైన చందమామను ఎంతసేపు చూసినా తనివితీరదు. వెన్నెల వెలుగులు అలాంటివి మరీ. మనిషి మనసు దోసేసి, హాయినిచ్చే ఆ వెలుగులను మరింత వినూత్నంగా ఆస్వాదించాలంటే ఈ కింది ప్రదేశాలకు తప్పకుండా వెళ్లాల్సిందే. ప్రతి పున్నమికీ ప్రత్యేకత సంతరించుకునే ఆ ప్రదేశాలపై ఓ లుక్కేద్దాం రండి.
ఉదయ్‌పూర్: పౌర్ణమి రోజు రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ సరస్సులు, రాజభవనాలు చంద్రకాంతిని ప్రతిబింబిస్తాయి. ఈ నగరమంతా బంగారు రంగులో మెరుస్తుంది. ఆ సమయం స్వర్ణయుగంగా అనిపిస్తుంది. నచ్చినవారితో వెళ్లి ఆస్వాదిస్తే ఆ అనుభూతే వేరు.
చంద్రతాల్: చంద్రతాల్ అంటే మూన్ లేక్ అని అర్థం. ఇది హిమాచల్ ప్రదేశ్‌లోని హిమాలయ శిఖరాల మధ్య ఉంటుంది. పౌర్ణమి రోజు ఎంతో అందంగా ధగధగ మెరుస్తూ చూసేవారికి ఆహ్లాదాన్ని కలిగిస్తుంది.
త్సో మోరిరి: లద్దాఖ్‌లోని ఎత్తైన ప్రదేశంలో త్సోమోరిరి ప్రవహిస్తూ ఉంటుంది. పౌర్ణమి రోజు ఈ నదీ జలాలు చంద్రుడు, నక్షత్రాల కాంతిని ప్రతిబింబిస్తూ మెరిసిపోతూ కనిపిస్తాయి. ప్రవాహం సాగినా వాటి కాంతి మాత్రం నిలకడగా ఉండి కనులకు కనువిందు చేస్తుంది.
కేరళం బ్యాక్ వాటర్స్: పౌర్ణమి రాత్రి కేరళం బ్యాక్ వాటర్స్‌లో హౌస్ బోట్ ప్రయాణం అద్బుతంగా ఉంటుంది. నీటిపై చంద్రుని ప్రతిబింబం మనసుకు ప్రశాంతమైన అనుభూతిని కలిగిస్తుంది.
తాజ్ మహల్: ఆగ్రాలో ఉన్న ఈ చారిత్రక కట్టడాన్ని తెల్లని పాలరాయితో నిర్మించారు. పౌర్ణమినాడు చంద్రుని వెలుగుతో మెరుస్తూ అక్కడికి వచ్చే ప్రేమికులను మురిపిస్తుంది. దాని అందం ఆ రోజు రెట్టింపు అవుతుంది.
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranabaali | రణబాలి ట్విట్టర్ రివ్యూ.. విజయ్ దేవరకొండ నటనకు ప్రశంసలు, కథనంపై మిశ్రమ స్పందన!
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలిని, రోహిత్ మధ్య బ్రేకప్ వార్.. టాస్క్‌లో ఓటమితో వంశీ కన్నీళ్లు!
Caller ID | కాలర్ పేరు ప్రదర్శించడం తప్పనిసరి.. టెలికం కంపెనీలకు కేంద్రం ఆదేశం
Paper Leak | 8 ఏండ్లుగా పేపర్ లీక్‌లే లేవట.. NTAపై కేంద్ర విద్యా శాఖ నివేదిక
Reservations | మతం మారితే రిజర్వేషన్ వర్తించదు.. సుప్రీంకోర్టు కీలక తీర్పు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

