Gold ring scheme : తమిళనాడు సీఎం (Tamil Nadu CM) జోసెఫ్ విజయ్ (Joseph Vijay) ఎన్నికల సందర్భంగా ఇచ్చిన మరో హామీని నిలబెట్టుకున్నారు. ఎన్నికల మేనిఫెస్టో (Election Manifesto) లో పేర్కొన్నట్టుగానే ప్రభుత్వ ఆస్పత్రుల (Govt Hospitals) లో జన్మించిన ప్రతి చిన్నారికి ఒక గ్రాము బంగారు ఉంగరం (1 gr Gold Ring) అందజేసే పథకాన్ని ఇవాళ (సోమవారం) ప్రారంభించారు. మధురై (Madhurai) లోని రాజాజీ ప్రభుత్వ ఆసుపత్రి (Rajaji govt hospital) లో విజయ్ స్వయంగా పిల్లలకు బంగారు ఉంగరాలు తొడిగారు.
మాతృత్వానికి గౌరవ సూచికంగా, ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవలను ప్రోత్సహించడం లక్ష్యంగా టీవీకే పార్టీ చీఫ్ విజయ్ ఎన్నికల వేళ బంగారు ఉంగరం హామీ ఇచ్చారు. ఈ పథకం కోసం ప్రభుత్వం రూ.755.83 కోట్లు కేటాయించింది. జూన్ 22 నుంచి పుట్టిన ప్రతి చిన్నారికీ ఇది వర్తించనుంది. ఇప్పటికే 1.28 లక్షల ఉంగరాలను ప్రభుత్వం సిద్ధం చేసినట్లు సమాచారం. తమిళంలో ఈ పథకం పేరు ‘థాయ్మామన్ తంగ మొతిరమ్ థిట్టమ్’. తెలుగులో మేనమామ ఇచ్చే బంగారు ఉంగరం అని అర్థం వస్తుంది.